రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తుల వివరాలను సరిపోల్చండి: ఈసీ
x

రాజీవ్ చంద్రశేఖర్ ఆస్తుల వివరాలను సరిపోల్చండి: ఈసీ

కేరళ తిరువనంతపురం లోక్ సభ బీజేపీ అభ్యర్థి రాజీవ్ చంద్రశేఖర్ దాఖలో చేసిన నామినేషన్ లో పేర్కొన్న ఆస్తులపై విచారించాలని కాంగ్రెస్ పార్టీ ఈసీని కోరింది.


కేరళ తిరువనంతపురం లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరుపున రాజీవ్ చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఆయన అఫిడవిట్ వివరాల్లో పొంతన ఉంటే సరిచూసుకోవాలని కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ)ని ఎన్నికల సంఘం మంగళవారం ఆదేశించింది. ఐక్యరాజ్యసమితి మాజీ దౌత్యవేత్త శశి థరూర్‌తో తలపడుతున్న చంద్రశేఖర్, తన అఫిడవిట్‌లో పేర్కొన ఆస్తులు, వాస్తవ ఆస్తులతో సరిపోలడం లేదని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేసింది.
అఫిడవిట్‌లో ఏదైనా తప్పులు జరిగినట్లయితే ప్రజాప్రాతినిధ్య చట్టం 1951లోని సెక్షన్ 125 A ప్రకారం వ్యవహరిస్తామని ఈసీ తెలిపింది.
నామినేషన్ పత్రాలు లేదా అఫిడవిట్‌లలో ఏదైనా సమాచారాన్ని దాచిపెట్టినట్లయితే ఆరు నెలల వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండూ విధించవచ్చు.
అప్పులెన్ని.. ఆస్తులెన్ని..
ఆస్తులకు సంబంధించి చంద్రశేఖర్ తన వద్ద రూ.52,000 నగదు, చరాస్తులతో పాటు మొత్తం రూ.9.26 కోట్లు ఉన్నట్లు చంద్రశేఖర్ తెలిపారు. ఇందులో రూ.10.38 కోట్లు బ్యాంకు డిపాజిట్లు, రూ.45.7 కోట్ల రుణాత్మక ఆస్తులు, బాండ్లలో రూ.2,500, ఎన్‌ఎస్‌సీలో రూ.2,500, వ్యక్తిగత రుణాలు రూ.41.2 కోట్లు, రూ.10,000 విలువ చేసే స్కూటర్, రూ.3.35 లక్షల విలువైన నగలు, మొత్తం రూ.5 లక్షల ఆస్తులు ఉన్నాయని, తన భార్యకు రూ.12.47 కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించారు. స్థిరాస్తుల కేటగిరీలో మార్కెట్ విలువ రూ.14.4 కోట్లుగా ప్రకటించారు. అయితే రూ.19.42 కోట్ల అప్పులను కూడా ఆయన అంగీకరించారు.
Read More
Next Story