ఏనుగు దాడిలో మృతురాలి కుటుంబానికి పరిహారం
x

ఏనుగు దాడిలో మృతురాలి కుటుంబానికి పరిహారం

ఏనుగు దాడిలో చనిపోయిన వృద్ధ మహిళ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఇకపై ఏనుగుల దాడిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.


ఏనుగు దాడిలో చనిపోయిన వృద్ధ మహిళ కుటుంబానికి కేరళ ప్రభుత్వం రూ. 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఇకపై ఏనుగుల దాడిని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రులు హామీ ఇచ్చారు.

ఘటన ఎలా జరిగింది?

అటవీ ప్రాంతానికి సమీపంలోని రబ్బరు తోటలో పనికి వెళ్లిన తన భర్తకు భోజనం ఇచ్చేందుకు 70 ఏళ్ల వృద్ధురాలు ఇందిరా రామక్రిష్ణన్ వెళ్లారు. ఆ సమయంలో ఆమెపై ఏనుగు దాడి చేసింది. ఆర్తనాదాలు విన్న ఇరుగుపొరుగు వారు ఆమెను రక్షించి కొత్తమంగళం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటన ఇడుక్కి జిల్లా ఆదిమాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంజిరవెల్లి ప్రాంతంలో సోమవారం ఉదయం జరిగింది. అయితే బాధితురాలి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం చేసేందుకు గ్రామ ప్రజలు నిరాకరించారు. ఈ ఘటనకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని పట్టుబట్టారు.

ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి పి రాజీవ్, జలవనరుల శాఖ మంత్రి రోషి అగస్టిన్‌ బాధితురాలి కుటుంబాన్ని కొత్త మంగళం హాస్పిటల్ లో పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావతం కాకుండా చర్యలు తీసుకుంటామని రాజీవ్ హామీ ఇచ్చారు. జనావాసాల్లోకి రాకుండా ఫెన్షింగ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. వన్యప్రాణులకు సంబంధించిన సమస్యలపై చర్చించేందుకు ఇడుక్కిలో ప్రత్యేక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి రాజీవ్‌ తెలిపారు.

Read More
Next Story