కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్‌పై ఈసీకి ఫిర్యాదు
బెంగళూరు (గ్రామీణ) లోక్‌సభ స్థానంలో "అవినీతి కార్యకలాపాలను" నిరోధించడంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విఫలమైందని జెడి (ఎస్) చీఫ్ దేవెగౌడ ఆరోపించారు.
కాంగ్రెస్ ఎంపీ డీకే సురేశ్ తన నియోజకవర్గంలో ఉచితాలను పంపిణీ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడని జెడి(ఎస్) అధ్యక్షుడు హెచ్‌డి దేవెగౌడ కేంద్ర ఎన్నికల సంఘానికి మార్చి 21న ఫిర్యాదు చేశారు. చర్యలు తీసుకోవడంలో రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం విఫలమైందని లేఖలో ఆరోపించారు. దీంతో స్పందించిన ఈసీ దేవెగౌడ ఫిర్యాదుపై వెంటనే స్పందించి "అవసరమైన చర్యలు" తీసుకోవాలని కర్ణాటక ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది.
విధుల్లో నిర్లక్ష్యం తగదు..
బెంగళూరు (గ్రామీణ) లోక్‌సభ స్థానంలో "అవినీతి కార్యకలాపాలను" నిరోధించడానికి రాష్ట్ర ఎన్నికల యంత్రాంగం వేగవంతమైన చర్యలు తీసుకోవడంలో విఫలమైందని జెడి (ఎస్) నాయకుడు దేవెగౌడ ఆరోపించారు. క్షేత్రస్థాయి యంత్రాంగం సకాలంలో చర్యలు తీసుకోకపోవడంతో గోడౌన్‌లో ఉచితాలను మరోచోటికి మార్చారని ఆయన ఆరోపించారు. అధికారులు తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడమే కాకుండా, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సోదరుడైన ప్రస్తుత ఎంపీ సురేష్‌పై చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారని గౌడ ఆరోపించారు.