అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్‌పై ప్రధానికి ఫిర్యాదు
x

అసభ్యంగా ప్రవర్తించిన ప్రొఫెసర్‌పై ప్రధానికి ఫిర్యాదు

యూనివర్సిటీ విద్యార్థినులను బాత్‌రూంలోకి తీసుకెళ్లారు. అసభ్యంగా ప్రవర్తించారు. విషయం బయటపడకుండా సీసీ ఫుటేజీ డిలేట్‌ ‌చూశారు. ఎక్కడంటే..


తమ ప్రొఫెసర్‌ ‌లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని హర్యానాలోని చౌదరి దేవిలాల్‌ ‌యూనివర్సిటీకి చెందిన 500 మంది విద్యార్థినులు ఏకంగా ప్రధాని మోదీ, హర్యానా సీఎం మనోహర్‌ ‌లాల్‌ ‌ఖట్టర్‌కు ఉత్తరాలు రాశారు.

యూనివర్సిటీ వైస్‌ ‌ఛాన్సలర్‌ ‌డాక్టర్‌ అజ్మీర్‌ ‌సింగ్‌ ‌మాలిక్‌, ‌హర్యానా గవర్నర్‌ ‌బండారు దత్తాత్రేయ, హర్యానా హోం మంత్రి అనిల్‌ ‌విజ్‌, ‌జాతీయ మహిళా కమిషన్‌ ‌చైర్‌ ‌పర్సన్‌ ‌రేఖా శర్మకు కూడా లెటర్లు రాశారు. ఆ ప్రొఫెసర్‌ను సస్పెండ్‌ ‌చేసి, హైకోర్టు రిటైర్డ్ ‌న్యాయమూర్తితో విచారణ జరిపించాలని డిమాండ్‌ ‌చేస్తున్నారు.

తమను తన ఆఫీసుకు పిలిపించి, బాత్‌రూమ్‌కి తీసుకెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించాడని లేఖలో విద్యార్థినులు పేర్కొన్నారు.

ఇలా చాలా నెలల నుంచి చేస్తున్నాడని, బయటపెడితే చాలా దారుణమైన పరిణామాలు ఉంటాయని బెదిరిస్తున్నాడని బాధితులు తెలిపారు. ఈ విషయం వైస్‌ ‌ఛాన్స్‌లర్‌ ‌దృష్టికి తీసుకెళితే తమకు సహాయం చేయడానికి బదులు యూనివర్సిటీ నుంచి బహిష్కరిస్తానని బెదిరిస్తున్నారని వాపోయారు. మౌనంగా ఉంటే పరీక్షల్లో ఎక్కువ మార్కులు ఇస్తామని వీసీ ఆఫర్‌ ‌చేశాడని చెబుతున్నారు.

ఈ ఆరోపణలపై దర్యాప్తు చేసేందుకు ఐపీఎస్‌ అధికారి దీప్తి గార్గ్ ఆధ్వర్యంలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) ‌దర్యాప్తు చేస్తుందని పోలీసులు తెలిపారు. ఈ బృందం ఇప్పటికే యూనివర్సిటీకి వెళ్లి బాధితుల వాంగ్మూలాన్ని రికార్డు చేసిందని పేర్కొన్నారు.

యూనివర్శిటీ రిజిస్ట్రార్‌ ‌డాక్టర్‌ ‌రాజేష్‌ ‌కుమార్‌ ‌బన్సాల్‌ ‌కేసు దర్యాప్తులో ఉందన్నారు. యూనివర్శిటీ కమిటీ కూడా ఆరోపణలపై విచారణ చేస్తోందన్నారు. సీసీటీవీ ఫుటేజీని కూడా పోలీసులకు అందజేశామని తెలిపారు. అయితే సదరు ప్రొఫెసర్‌ అప్పటికే ‘‘తన కార్యాలయంలోని సీసీ ఫుటేజీలోని అసభ్యకర దృశ్యాలను తొలగించాడని చెప్పారు.

Read More
Next Story