కాంగ్రెస్ కు రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదు: బీజేపీ
x

కాంగ్రెస్ కు రాజకీయ పార్టీగా కొనసాగే నైతిక హక్కు లేదు: బీజేపీ

రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ భగ్గుమంది. అధికరణ 370 రద్దు చేసే అంశాన్ని ప్రశ్నించడంపై కమలదళం..


రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో అధికరణ 370 ని రద్దు అంశాన్ని ప్రస్తావించిన ఏఐసీసీ అధ్యక్షుడి మల్లికార్జున్ ఖర్గే పై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దేశంలో ఒక రాజకీయ పార్టీగా ఉండాల్సిన నైతిక అర్హతను కాంగ్రెస్ కోల్పోయిందని విమర్శలు గుప్పించింది.

ఆర్టికల్ 370 తొలగింపుతో అక్కడ తేడా ఏం జరిగిందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే నిన్న రాజస్థాన్ లో జరిగిన ఎన్నికల ర్యాలీ లో అన్నారు. "కశ్మీర్‌లో విలీనంతో ఇతర రాష్ట్రాల్లో ఎలాంటి తేడా వస్తుందని ఒక పార్టీ ప్రశ్నిస్తోంది. ఇది వారి ఐక్యత, సమగ్రత, పనితనం, దేశానికి వారిచ్చిన గౌరవం ఇది’’ అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సుధాన్సు త్రివేది అన్నారు.

ఆర్టికల్ 370పై రద్దు సమయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుతో, "జాతీయ పార్టీ హోదా లేదా హక్కును దాదాపు కోల్పోయిన కాంగ్రెస్, ఇప్పుడు నైతిక దృక్కోణంలో రాజకీయ పార్టీగా ఉండే హక్కును కూడా కోల్పోయింది" అని బిజెపి నాయకుడు విమర్శించారు . కాంగ్రెస్ ఇప్పుడు తనను తాను "ప్రాంతీయ శక్తుల సమ్మేళనం" పిలుచుకుంటోంది. దాని స్థాయి ప్రాంతీయ పార్టీల కంటే తక్కువకి దిగజారిందని వ్యాఖ్యానించారు.

ఖర్గే వ్యాఖ్యలను 'సిగ్గుమాలినవి'గా కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగమని, దేశంలోని మిగిలిన ప్రాంతాలపై జమ్మూ కాశ్మీర్ ప్రజలకు హక్కు ఉన్నట్లే ప్రతి రాష్ట్రానికి పౌరుడికి దానిపై హక్కు ఉందని ఆయన కాంగ్రెస్‌కు గుర్తు చేశారు.

అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జెపి నడ్డాతో సహా ఇతర బిజెపి నాయకులు X లో ఖర్గే చేసిన ప్రసంగం యొక్క చిన్న క్లిప్‌ను షేర్ చేశారు. దీనిలో ఖర్గే ఆర్టికల్ 370 రద్దు చేసినందుకు ఆగ్రహం వ్యక్తం చేశారు.

"అరే భాయ్, యహాన్ కే లోగోన్ సే క్యా వస్తా హై (దీనికి ఇక్కడి ప్రజలతో సంబంధం ఏమిటి)?" అని ఖర్గే క్లిప్‌లో అడుగుతున్నారు. కాంగ్రెస్ చీఫ్ కూడా ఆర్టికల్ 370కి బదులుగా ఆర్టికల్ 371ని తప్పుగా ప్రస్తావించారు. దీనితో జమ్మూకాశ్మీర్ అంశాన్ని కాంగ్రెస్, బీజేపీకి అందించిన అస్త్రంగా విశ్లేషకులు భావిస్తున్నారు.

Read More
Next Story