మీ సంపద ముస్లింలకు పంచేందుకు అంగీకరిస్తారా?
x

మీ సంపద ముస్లింలకు పంచేందుకు అంగీకరిస్తారా?

ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. రాజస్థాన్ లోని జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు.


భారతదేశంలోని వనరులపై మైనారిటీ వర్గానికి మొదటి హక్కు ఉందని గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రజల సంపదను ముస్లింలకు తిరిగి పంచుతుందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు.

రాజస్థాన్‌లోని బన్స్వారాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ.. ప్రజలు కష్టపడి సంపాదించిన డబ్బు, అలాగే వారి విలువైన వస్తువులను "చొరబాటుదారులకు", "ఎక్కువ మంది పిల్లలు ఉన్నవారికి" ఇవ్వాలని కాంగ్రెస్ యోచిస్తోందని ఆరోపించారు.

‘ఈ అర్బన్ నక్సల్ మైండ్‌సెట్ ఉన్నవారు అధికారంలోకి వస్తే.. వారు మీ 'మంగళసూత్రాన్ని' కూడా వదలరు’ అని మోడీ అన్నారు. గతంలో మన్మోహన్ సింగ్ వ్యాఖ్యలను గుర్తుచేస్తూ.. దేశ ఆస్తులపై మొదటి హక్కు ముస్లింలకే ఉందన్నారు. ఎక్కువ మంది పిల్లలు ఉన్న వారికి ఆ ఆస్తికి పంచాలని దానర్థం. చొరబాటుదారులకు పంచిపెడతారన్న మాట. మీరు కష్టపడి సంపాదించిన డబ్బు చొరబాటుదారులకు దక్కుతుంది. దీనికి మీరు అంగీకరిస్తారం? అని ప్రశ్నించారు. 2006లో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చేసిన ఈ వివాదాస్పద వ్యాఖలు మోదీ ప్రస్తావించారు.

కాంగ్రెస్ రియాక్షన్..

మోదీ వ్యాఖ్యలకు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల తొలి విడతలో నిరాశ చవిచూసిన ప్రధాని ఇప్పుడు ‘అబద్ధాలు’ చెప్పి ప్రజల దృష్టిని అసలు సమస్యల నుంచి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు.

ఏప్రిల్ 7న హైదరాబాద్‌లో దేశ సంపదను పునఃపంపిణీ చేస్తామని రాహుల్ గాంధీ వాగ్దానం చేయలేదని, ఆయన మాటలను బీజేపీ నాయకులు వక్రీకరించారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ పేర్కొన్నారు. దేశ సంపద సమాన పంపిణీకి సర్వే నిర్వహించాల్సిన అవసరం ఉందని మాత్రమే రాహుల్ గాంధీ చెప్పారని స్పష్టత ఇచ్చారు.

మోదీది ‘ద్వేషపూరిత ప్రసంగం’..ఖర్గే, రాహుల్..

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మోదీ వ్యాఖ్యలను తన ఎక్స్ ఖాతాలో తప్పుబట్టారు. మోదీ ప్రసంగాలు "ద్వేషపూరితమైనవని" పేర్కొన్నారు. "మోదీ ప్రసంగాల్లో భయం ధ్వనిస్తోంది. మొదటి దశ ఫలితాల్లో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిచే అవకాశం ఉంది. మోదీ ప్రసంగం విద్వేషపూరిత ప్రసంగం మాత్రమే కాదు. ప్రజల దృష్టిని మరల్చే వ్యూహం కూడా.’’అని ఖర్గే పేర్కొన్నారు. మోదీ అబద్ధాలతో ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారని కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ అన్నారు.

పేదల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం..

పేదల సంక్షేమానికి బీజేపీ కట్టుబడి ఉందని చెప్పారు మోదీ. కాంగ్రెస్ పాలనలో దళితులు, గిరిజనులు, మైనారిటీలను భయం వెంటాడేదన్నారు. అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే గిరిజన సంక్షేమ మంత్రిత్వ శాఖ ఏర్పాటైంది. కోట్లాది మంది గిరిజన కుమారులు, కూతుళ్లలో 60 ఏళ్లలో ఒక్క వ్యక్తి కూడా దేశానికి రాష్ట్రపతి కాలేకపోయారు. 2014లో బీజేపీని గెలిపించాక ఒక గిరిజన కుమార్తె దేశానికి రాష్ట్రపతి అయ్యారు. ఇదే నిజమైన భాగస్వామ్యం. ఇదే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగ స్ఫూర్తి. అని పేర్కొన్నారు.

సోనియాపై దాడి..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీపై పరోక్ష ఆరోపణలు చేశారు. ఎన్నికల్లో గెలవలేని వారు "రంగం నుండి పారిపోయి" రాజస్థాన్ నుండి రాజ్యసభకు వచ్చారని మోడీ అన్నారు. ఫిబ్రవరిలో రాజస్థాన్ నుంచి రాజ్యసభకు ఎన్నికైన ఎంపీల్లో కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ కూడా ఉన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పలువురు కాంగ్రెస్‌కు చెందిన ప్రముఖులు పోటీకి దిగలేదు. ప్రస్తుత పరిస్థితికి కాంగ్రెస్సే కారణమని మోదీ అన్నారు

Read More
Next Story