వంటగ్యాస్ సిలిండర్ రూ.2వేలు అవుతుందా?
x

వంటగ్యాస్ సిలిండర్ రూ.2వేలు అవుతుందా?

వంట గ్యాస్ సిలిండర్ రేటు పెరగబోతుందని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ చెప్పారు. ఆమె అలా చెప్పడానికి కారణం ఏమిటి?


కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే వంటగ్యాస్ సిలిండర్ ధరను రూ.2000కు పెంచుతుందని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ అన్నారు. వెస్ట్ బెంగాల్ ఝర్‌గ్రామ్‌ జిల్లాలో జరిగిన ప్రభుత్వ కార్యక్రమంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.

"ఎన్నికలలో బిజెపి గెలిస్తే, వాళ్లు వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ. 1,500 నుంచి రూ. 2,000కి పెంచవచ్చు. మళ్లీ మనం పొయ్యి వెలిగించడానికి కలపను సేకరించే పాత పద్ధతికి వెళ్లాలి" అని బెనర్జీ అన్నారు.

కేంద్రానికి డెడ్ లైన్..

ఆవాస్ యోజన కింద ఇళ్ల నిర్మాణాలను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి మమతా అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తమ ప్రభుత్వమే మే నుంచి వాటి నిర్మాణాన్ని ప్రారంభిస్తుందని చెప్పారు. గడువులోపు లబ్ధిదారులకు కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకపోతే తమ ప్రభుత్వమే 11 లక్షల ఇళ్లను నిర్మించి ఇస్తుందని సీఎం మమత చెప్పారు.

ఉపాధి హామీ వేతనాలు చెల్లించాలి..

జాతీయ ఉపాధి హామీ పథకం కార్మికులకు చెల్లించాల్సిన వేతనాలను కేంద్ర ప్రభుత్వం చెల్లించలేదని ఆరోపిచారు. గత రెండేళ్లుగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు చెల్లించడం లేదన్నారు. తామే 59 లక్షల మందికి బకాయిలు చెల్లించామని చెప్పారు. సందేశ్‌ఖాలీ ప్రాంతంలో మహిళలపై లైంగిక వేధింపులు, భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న పార్టీ నాయకుడు షాజహాన్ షేక్ అరెస్టుపై తృణమూల్ కాంగ్రెస్ అధిష్టానం మౌనం వహించింది. షేక్‌ను గురువారం తెల్లవారుజామున అరెస్టు చేశారు.

Read More
Next Story