‘‘కార్పొరేట్ పన్నులు తగ్గించిన, పెట్టుబడులు ఎందుకు పెరగట్లేదు’’
x

‘‘కార్పొరేట్ పన్నులు తగ్గించిన, పెట్టుబడులు ఎందుకు పెరగట్లేదు’’

ఎన్నికల ఉచితాలపై ఆందోళన వ్యక్తం చేసిన ‘ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్. శ్రీనివాసన్


నిషా పి. శేఖర్

లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్ఠిక సర్వే దేశ వృద్ధికి బ్లూప్రింట్ నిర్దేశించింది. జీడీపీ వృద్ధిరేట్ వచ్చే ఏడాది 6.3 శాతం నుంచి 6.8 శాతంగా ఉంటుందని అంచనా వేసింది.

అయినప్పటికీ ప్రైవేట్ పెట్టుబడులు ఆశించినంతగా లేవు. గ్రామీణ డిమాండ్ తగ్గుతోంది. అలాగే ద్రవ్యోల్భణంతో రోజువారీ ఖర్చులు ప్రభావితం అవుతూనే ఉన్నాయి. ఈ అంశంపై ‘ ది ఫెడరల్’ ఎడిటర్ ఇన్ చీఫ్ ఎస్ శ్రీనివాసన్ తన అభిప్రాయాలను వెల్లడించారు.

ఉద్యోగ భద్రత..
ప్రస్తుతం ఏఐ ట్రెండ్ కొనసాగుతోంది. ఉద్యోగాలను భర్తీ చేయడం కంటే ఏఐ వృద్ధి చెందుతుందని ఆర్థిక సర్వే చెప్పింది. శ్రీనివాసన్ ఈ అంశాన్ని వివరిస్తూ ‘‘కొన్ని ఉద్యోగాలు, వాటి స్వభావం మారుతున్నాయి.
ఏఐ కూడా సామర్థ్యాన్ని పెంచుకుంటోంది. కొత్త అవకాశాలను సృష్టిస్తోంది. ఈ సవాళ్లను ఎదుర్కోవడానికి రీస్కిల్లింగ్ కీలకం’’. అలాగే విద్య, ఇంజనీరింగ్ పై దృష్టి కేంద్రీకరించడం వలన దేశపు శ్రామిక శక్తి అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలకు అనుగుణంగా మారవలసిన అవసరాన్ని హైలైట్ చేస్తుంది.
ద్రవ్యోల్భణం.. సగటు జీవి
ద్రవ్యోల్భణం అదుపులో ఉందన్న వాదనలు ఉన్నప్పటికీ టమోటాలు, పప్పులు వంటి నిత్యావసరాలు ఖరీదైపోయాయి. ఎడిటర్ ఇన్ చీఫ్ వివరిస్తూ.. ‘‘రోజువారీ నిత్యావసరాల పై వినియోగదారుల ధరల సూచిక ఎక్కువ వెయిటేజీ తీసుకుంటోంది. ఇందులో వాతావరణ మార్పులు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నిత్యావసర ధరలు స్థిరీకరించే ప్రయత్నం జరుగుతున్నప్పటికీ, వాటి వేగం ఆశించినంత వేగంగా లేదు.’’ అన్నారు.
సొంతింటి కల ..
మధ్య తరగతి కుటుంబాలకు సొంత ఇల్లు అనేది సుదూర కలలా అనిపిస్తుంది. రెపోరెట్లపై ఆర్బీఐ జాగ్రత్తగా వ్యవహరించడం, రేట్లను సడలించడానికి ఆర్థికమంత్రిత్వ శాఖ ఒత్తిడి చేయడం మధ్య టగ్ ఆఫ్ వార్ ను శ్రీనివాస్ ను ప్రస్తావించారు. ‘‘ ఆర్థిక క్రమశిక్షణ వృద్ధి కేంద్రీకృత విధానాలతో సరిపోలకపోతే వడ్డీ రేట్లు ఎక్కువగా ఉండవచ్చు’’ అని ఆయన పేర్కొన్నారు.
భారీగా పెరిగిన కార్పొరేట్ లాభాలు..
దేశంలో కార్పొరేట్ కంపెనీల లాభాలు 22 నుంచి 24 శాతం రికార్డు స్థాయిలో లాభాలు ఆర్జించాయి. ఇదే కాలంలో కార్మికుల వేతనాలు కేవలం 1.5 శాతం పెరిగాయి. ఈ అసమానతలను ఎడిటర్ ఇన్ చీఫ్ ప్రస్తావించారు. ‘‘పెట్టుబడులను పెంచడానికి కార్పొరేట్ పన్ను తగ్గింపులు తిరిగి పేదలకు చేరలేదు. అందువల్ల వినియోగం తగ్గింది. ప్రస్తుత ఆర్థిక వాతావరణంలో పెట్టుబడులు పెట్టగల విశ్వాసం ప్రైవేట్ రంగానికి లేదు’’ అన్నారు.
శక్తి పరివర్తన..
దేశంలో పునరుత్పాదక ఇంధనాల నుంచి 50 శాతం విద్యుత్ ను 2030 నాటికి సాధించాలనే లక్ష్యం పెట్టుకుంది. ‘‘ఈ విషయంలో భారత్, చైనా నుంచి తక్కువ ఖర్చుతో కూడిన సోలార్ భాగాలను దిగుమతి చేసుకోవడంపై ఆధారపడి ఉంది. ఈ లక్ష్యాలను చేరుకోవడానికి పెట్టుబడి, సాంకేతిక ఆధునీకరణ చాల ముఖ్యమైనవి’’ అని ఎస్. శ్రీనివాసన్ వివరించారు.
సృజనాత్మక సమస్య పరిష్కారం వంటి భర్తీ చేయలేని వంటి వాటిపై దృష్టి పెడితే భారత్ కు మంచి అవకాశం ఉంది.
ఆర్థిక క్రమశిక్షణ
ద్రవ్యలోటు 4.8 శాతం అవకాశం ఉన్నందున ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను కొనసాగిస్తున్నందుకు శ్రీనివాసన్ ప్రశంసించారు. అయినప్పటికీ ఎన్నికలు అనగానే ప్రకటించే ఉచితాలు, ఆర్థిక క్రమశిక్షణ ను దారి తప్పిస్తున్నాయని ఎడిటర్ ఆందోళన చెందారు. ‘‘మధ్య తరగతి ఈ భారాన్ని భరిస్తుంది. సమతుల్యతను సాధించడం కీలకం’’ అన్నారు.
ఆర్ధిక సర్వే దేశ ఆశయాలు, సవాళ్లను వెల్లడిస్తోంది. ఇది ఏఐ ద్వారా వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడానికి ఇంధన లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన దారులను సూచిస్తుంది. బడ్జెట్ సమీపిస్తున్న కొద్ది కొన్ని క్లిష్టమైన ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఇది దేశంలో సమగ్ర వృద్ధిని, స్థిరత్వంతో సమతుల్యం చేస్తుందా చూడాలి?
Read More
Next Story