కవితకు బీఆర్ఎస్ తో తెగిపోయిన సాంకేతిక బంధం
x
Kalvakuntla Kavitha

కవితకు బీఆర్ఎస్ తో తెగిపోయిన సాంకేతిక బంధం

కల్వకుంట్ల కవిత ఎంఎల్సీకి చేసిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు


కల్వకుంట్ల కవిత ఎంఎల్సీకి చేసిన రాజీనామాను శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. తాజా పరిణామంతో కవితకు బీఆర్ఎస్ తో ఉన్న సాంకేతిక బంధం తెగిపోయింది. మంగళవారం రాత్రి కవిత(Kavitha) రాజీనామాకు ఛైర్మన్ ఆమోదం తెలిపినట్లుగా మండలి కార్యదర్శి ప్రకటించారు. గడచిన ఐదుమాసాలుగా కవిత రాజీనామాకు ఆమోదం తెలపకుండా ఛైర్మన్ పెండింగులోనే పెట్టిన విషయం తెలిసిందే. (BRS)బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) కు రాసిన లేఖ లీక్ అవటంతో కవితకు పార్టీతో గ్యాప్ పెరిగిపోయింది. అప్పటికే పార్టీలో తన సోదరుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ (KTR)కేటీఆర్, మాజీమంత్రి, సిద్ధిపేట ఎంఎల్ఏ తన్నీరు హరీష్ రావుతో(Harish) విభేదాలు బాగా పెరిగిపోయాయి. అయితే కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ అయిన సందర్భంగా విభేదాలు బయటపడ్డాయి.

తన లేఖ లీకైన విషయం నుండి పార్టీలోని అంతర్గత విషయాలను కవిత బహిరంగంగా ప్రశ్నించటం మొదలుపెట్టారు. దాంతో పార్టీలో కవితకు రెబల్ లీడర్ గా ముద్రపడింది. అప్పటినుండి కేసీఆర్ కూడా కవితను దూరంగా పెట్టేయటం మొదలుపెట్టారు. ఈ గ్యాప్ ఎంతదాకా వెళ్ళిందంటే ఫామ్ హౌస్ లోకి కవితకు ఎంట్రీ దొరకనంతవరకు. రెండోకొడుకు అమెరికాకు వెళుతున్న సందర్భంగా ఆశీస్సులు కావాలని కవిత కొడుకుతో కలిసి ఫామ్ హౌస్ కు వెళ్ళారు. అయితే కవిత మొహం చూడటానికి కూడా కేసీఆర్ ఇష్టపడలేదు. దాంతో కొడుకును మాత్రమే కేసీఆర్ శ్రీమతి బెడ్ రూములోకి తీసుకెళ్ళి ఆశీస్సులు ఇప్పించారు.

ఇలాంటి అనేక ఘటనల తర్వాత కేసీఆర్ పాలనలో జరిగిన అవినీతి, అవకతవకలను కవిత మీడియా ముఖంగానే ప్రశ్నించటం మొదలుపెట్టారు. కేటీఆర్, హరీష్ పై బహిరంగ ఆరోపణలు, విమర్శలకు దిగటంతో కవితను పార్టీలో నుండి సస్పెండ్ చేశారు. తనను పార్టీలో నుండి సస్పెండ్ చేయటంతో మండిపోయిన కవిత ఎంఎల్సీ పదవికి కూడా సెప్టెంబర్ 3వ తేదీన రాజీనామా చేశారు. నిజామాబాద్ స్ధానికసంస్ధల కోటా నుండి రెండోసారి ఎంఎల్సీగా ఎన్నికయ్యారు. 2021, డిసెంబర్ లో ఎన్నికైన కవిత పదీకాలం ఆ ఏడాది డిసెంబర్ వరకు ఉంది.

తన రాజీనామాను ఆమోదించాలని కవిత ఎన్నిసార్లు ఛైర్మన్ కు విజ్ఞప్తిచేసినా గుత్తా మాత్రం సీరియస్ గా తీసుకోలేదు. అయితే నాలుగురోజుల క్రితం మండలి సమావేశంలో కవిత భావోద్వేగంతో మాట్లాడుతు కేసీఆర్ పాలనపైన చాలా ఆరోపణలు చేశారు. మండలికి తాను చేసిన రాజీనామాను ఆమోదించాలని, ఇకనుండి తాను సభకు వచ్చేదిలేదని విజ్ఞప్తిచేశారు. చివరకు చేసేదిలేక కవిత రాజీనామాను ఛైర్మన్ ఆమోదించారు. ఛైర్మన్ రాజీనామాను ఆమోదించటంతో కవితకు బీఆర్ఎస్ తో ఉన్న సాంకేతిక అనుబంధం కూడా తెగిపోయినట్లయ్యింది.

Read More
Next Story