జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయమేంటి?
x

జ్ఞానవాపి కేసులో మసీదు కమిటీ పిటిషన్‌పై కోర్టు నిర్ణయమేంటి?

జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో పూజలు చేయవచ్చని జనవరి 31న వారణాసి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టును ఆశ్రయించింది.


మసీదు సముదాయంలోని 'వ్యాస్‌ తెహ్‌ఖానా'లో హిందూ దేవతలను పూజించేందుకు వారణాసి జిల్లా కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ తీర్పును సవాలు చేస్తూ జ్ఞాన్‌వాపి మసీదు కమిటీ వేసిన పిటిషన్‌ను అలహాబాద్ హైకోర్టు సోమవారం (ఫిబ్రవరి 26) తోసిపుచ్చింది.

జ్ఞానవాపి మసీదు దక్షిణ సెల్లార్‌లో పూజలు చేయవచ్చని జనవరి 31న వారణాసి జిల్లా కోర్టు తీర్పు చెప్పింది. ఈ తీర్పుపై మసీదు కమిటీ ఫిబ్రవరి 2న సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారించడానికి నిరాకరించింది. అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించాలని కోరింది. అదే రోజు కమిటీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అలహాబాద్ హైకోర్టు ఫిబ్రవరి 15న ఇరుపక్షాల వాదనలను విని, తన నిర్ణయాన్ని రిజర్వు చేసింది.

వారణాసి జిల్లా కోర్టులో అసలు పిటిషనర్ శైలేంద్ర కుమార్ పాఠక్, తన తల్లితండ్రులు సోమనాథ్ వ్యాస్ డిసెంబర్ 1993 వరకు మసీదులో ప్రార్థనలు చేశారని పేర్కొన్నాడు. వంశపారంపర్యంగా 'పూజారి'గా ఉంటున్న తనను స్వామికి నైవేద్యాన్నిపెట్టేందుకు అనుమతించాలని పాఠక్ కోర్టును ఆశ్రయించాడు.

హిందూ దేవాలయ అవశేషాలపై చక్రవర్తి ఔరంగజేబ్ పాలనలో మసీదు నిర్మాణం జరిగిందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI) నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగానే వారణాసి జిల్లా కోర్టు తీర్పును ఇచ్చింది. అయితే మసీదు కమిటీ సెల్లార్‌లో విగ్రహాలు లేవని, 1993 వరకు అక్కడ ప్రార్థనలు చేయలేదని వాదిస్తోంది.

Read More
Next Story