ఐపీఎల్: ఆర్సీబీ కథ.. కావ్యంలా మారుతుందా?
x

ఐపీఎల్: ఆర్సీబీ కథ.. కావ్యంలా మారుతుందా?

ఐపీఎల్ చివరి దశకు వచ్చేసింది. ఇప్పటికే కేకేఆర్ ఫైనల్లో అడుగుపెట్టగా, నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో ఇద్దరు రాయల్స్ పోటీ పడబోతున్నారు.


ఆర్సీబీ నేడు ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ తో తలపడనుంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం నుంచి అనూహ్యంగా విజయాలు సాధిస్తూ తిరిగి ప్లే ఆఫ్ దశ కు చేరింది ఆర్సీబీ. తనకు అందని ద్రాక్షగా ఊరిస్తున్న తొలి ఐపీఎల్ టైటిల్ ను సాధించాలని పట్టుదలగా ఉంది. అయితే దీనికోసం మరో రెండు మెట్లు ఎక్కాల్సి ఉంది.

IPL 2024 మార్చి 22న ప్రారంభమైంది, చెన్నైలోని MA చిదంబరం స్టేడియంలో ఆర్సీబీ, డిఫెండింగ్ ఛాంపియన్‌లు చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడింది. ఐపీఎల్ ప్రారంభమైనప్పుడు అన్ని జట్ల లక్ష్యం ఒకటే. మొదటి నాలుగు స్థానాల్లో నిలవాలి. తరువాత ఫైనల్లో గెలిచి ట్రోఫిని ముద్దాడాలని.
కానీ టోర్నీ ప్రారంభం నుంచి ఆర్సీబీ పరిస్థితి రివర్స్ గేర్ లో వెళ్లడం మొదలుపెట్టింది. మొదటి ఏడు మ్యాచ్ లలో కేవలం ఒకే ఒక విజయం సాధించింది. దాంతో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానం దక్కింది. ముఖ్యంగా కోల్ కత తో జరిగిన మ్యాచ్ లో కేవలం ఒకే ఒక పరుగు తేడాతో ఓటమి పాలవడంతో జట్టు ఆత్మ విశ్వాసం దెబ్బతింది. దాంతో జట్టు తరువాత అనేక వరుస పరాజయాలను చవిచూసింది.
పరాజయాలే వారధిగా..
సమగ్రంగా ఓడిపోయాక ఆర్సీబీ ఒక్కసారిగా జూలు విదిల్చింది. పోరాడితే పోయేదేముంది అన్న తరహాలో వేట సాగించింది. అయితే ఏడు మ్యాచ్ ల్లో పరాజయం తరువాత జరిగే అన్ని మ్యాచ్ లు గెలవాల్సిన పరిస్థితి. ఎక్కడ ఆత్మరక్షణ ధోరణి ప్రదర్శించకుండా, నెట్ రన్ రేట్ పడిపోకుండా చూసుకుంటూ తన ఆటతీరును మెరుగుపరుచుకుంది. ఇదే సమయంలో వారికి ఇతర సమీకరణాలు కూడా కలిసి వచ్చాయి. ముఖ్యంగా చెన్నైతో జరిగిన మ్యాచ్ లో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోయే పరిస్థితి. అయితే అదృష్టం ఆర్సీబీ వైపే నిలిచింది.
అసాధారణ వేట
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక స్కోరును నమోదు చేసింది, ఎస్ ఆర్ హెచ్ మూడు వికెట్లకు 287 పరుగులు చేసింది. ఆ సమయంలో, RCB 262తో ప్రత్యుత్తరమిచ్చిన విషయంపై చాలా మంది శ్రద్ధ చూపారు,
ఇది అసాధారణమైన ఛేజింగ్, లక్ష్యానికి కేవలం 25 పరుగులు దూరంలో ఆగిపోయారు. అంతకుముందు కేకేఆర్ పై ఒక పరుగు తేడాతో, భారీ స్కోర్ ను చేజ్ చేసే సమయంలో పాతిక పరుగుల తేడాతో ఓడిపోవడం ఆర్సీబీ ఆటగాళ్లలో కసి రగిలేలా చేసింది. ప్రత్యర్థి కంటే తమను తామే ఓడించుకున్నామనే భావన వారిలో కలిగింది. తరువాత జట్టు మానసిక స్థితిలో పూర్తిగా మార్పు కలిగింది.
ఆర్సీబీ లో లీగ్ ప్రారంభంలో కేవలం ఇద్దరు బ్యాట్స్ మెన్ పై మాత్రమే ఎక్కువగా ఆధారపడింది. వారిలో కింగ్ విరాట్ కోహ్లి, డ్యాషింగ్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ మాత్రమే అన్ని బాధ్యతలు తీసుకున్నారు. బౌలర్లు దారుణంగా పరుగులు సమర్పించుకోవడం, వికెట్లు తీయలేకపోవడంతో అంతా గందరగోళ పరిస్థితులు.
ఇదే విషయాన్ని కెప్టెన్ డుప్లెస్సిస్ కూడా అంగీకరించాడు. బౌలింగ్ లో లోతు లేకపోవడంతో ప్రతి బ్యాట్స్ మెన్ కూడా 200 పరుగులు చేయాల్సిన ఒత్తిడి పడుతోందని నిరాశను వ్యక్తం చేశాడు. బహుశా, మొహమ్మద్ సిరాజ్ అండ్ కో దీనిని బాగా సీరియస్ గా తీసుకుంటున్నట్లు ఉన్నారు. తమను పబ్లిక్ గా అలా అనడంతో బూడిద నుంచి లేచిన ఫీనిక్స్ పక్షిలా ఒక్కసారిగా ఆకాశంలోకి ఎగిరారు. బ్యాట్స్ మెన్ కూడా తమ వంతుగా బాధ్యతతో కలిసిన దూకుడును ప్రదర్శించారు.
ఏప్రిల్ చివరిలో SRHతో జరిగిన రిటర్న్ మ్యాచ్‌లో విజయం - ఈ సీజన్‌లో RCB తొమ్మిది ప్రయత్నాలలో రెండవది మాత్రమే - వారి ఆఖరి లీగ్ క్లాష్‌లో CSKతో గెలవడం అద్భుతమనే చెప్పాలి. నిజానికి దీనికి అంత ప్రాధాన్యం లేందీగానే క్రికెట్ విశ్లేషకులు చూశారు.
ఎందుకంటే గత 32 మ్యాచ్ లు రెండు జట్ల మధ్య జరిగితే అందులో 20 సార్లు సీఎస్కేనే విజయం సాధించింది. అయితే కొత్త చరిత్రను రాయాలని కెప్టెన్ ఫాఫ్ డ్యూ ప్లెసిస్ బృందం నిర్ణయించుకుంది. వారు ఆశ, ఆకలి, ఆశయం వంటి లక్షణాలను ఒంటబట్టించుకుని మ్యాచ్ బరిలోకి దిగారు.
RCB టాలిస్మాన్
డు ప్లెసిస్ ఆర్సీబీ కెప్టెన్ కావచ్చు, కానీ RCB టాలిస్మాన్ మాత్రం కోహ్లి. కోహ్లీ-క్యామ్ తన ఫ్రాంచైజీలో లేదా జాతీయ జట్టులో అధికారిక నాయకుడు కానప్పటికీ జట్టు వ్యూహాలు, అనుభవంలో అతడికి సాటిలేదు. పరుగులు సాధించినప్పుడు, వికెట్ పడినప్పుడు కోహ్లి జరుపుకునే విలక్షమైన సెలబ్రేషన్స్ సహచర ఆటగాళ్లకు స్ఫూర్తిని రగిలించాయి. దీంతో ప్రతి మ్యాచ్ లో ఫీల్డర్లు రేపు అన్నది లేనట్లుగా మైదానంలో చెలరేగారు. ఇలా అన్ని విభాగాల్లో జట్టు మొత్తం పటిష్టంగా తయారైంది.
ముందున్న సవాళ్లు
కథ అద్భుత కావ్యంగా మారాలంటే, అహ్మదాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో బుధవారం జరిగే ఎలిమినేటర్‌తో ప్రారంభించి RCB మరో మూడు గేమ్‌లు గెలవాలి. విషయాలను దృష్టిలో ఉంచుకుంటే, 2011లో ప్లేఆఫ్‌లు ప్రవేశపెట్టబడినప్పటి నుంచి, ఎలిమినేటర్‌లో ఆడిన జట్టు ఒక్కసారి మాత్రమే ఛాంపియన్‌గా నిలిచింది - అది కూడా 2016లో సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రమే కప్ ను ముద్దాడింది. అయితే RCB ఈ సీజన్ లో ఆరు నాకౌట్ గేమ్‌లు ఆడినట్లు చెప్పవచ్చు. ఇప్పటి వరకూ తప్పు జరగలేదు కానీ ఒత్తిడిలో గేమ్ ఎలా మారుతుందో చూడాలి.
రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు బెంగళూర్ మొదట ఏ పరిస్థితులో ఉందో అదే స్థితిలో ఉంది. నెల వరకూ వారు వరుసగా ఎనిమిది విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండేవారు. అయితే వరుసగా మ్యాచ్ లు ఓడిపోతూ మళ్లీ తీవ్రమైన నిరాశలో కుంగిపోయారు. ఫాఫ్ లాగా ఇప్పుడు సంజూ కూడా తన సహచరులతో విశ్వాసం నింపాలి. అలాగై రాజుల పోరాటంలో వీరే విజేతలవుతారు. లేదంటే కథ ఇక్కటితో సమాప్తం


Read More
Next Story