క్రికెటర్ ‘లమిచానే’కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష
x
సందీప్ లమిచానే, నేపాల్ క్రికెటర్

క్రికెటర్ ‘లమిచానే’కు ఎనిమిదేళ్ల జైలు శిక్ష

ఇంతకు ముందు ఐపీఎల్ లో ఢిల్లీ క్యాపిటల్ తరఫున ఆడిన ఆ ఆటగాడు, చేసిన తప్పు రుజువు కావడంతో కోర్టు జైలు శిక్ష విధించింది. ఇంతకీ అతను చేసిన తప్పెంటీ? ఎవరతను?


నేపాల్ క్రికెటర్ సందీప్ లమిచానే కు ఖాట్మండ్ కోర్టు ఎనిమిదేళ్ల జైలు శిక్ష విధించింది. 18 సంవత్సరాల యవతిని బలవంతం చేశారనే ఆరోపణలు రుజువు కావడంతో కోర్టు శిక్ష ఖరారు చేసింది. అలాగే లమిచానే కు కోర్టు మూడు లక్షల జరిమానా సైతం విధించింది. అందులో రెండు లక్షలు బాధితురాలికి ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. అయితే ఈ కోర్టు తీర్పును ఉన్నత న్యాయస్థానంలో సవాల్ చేస్తామని సందీప్ తరఫున వాదిస్తున్న సరోజ్ ఘిమిరే మీడియాకు చెప్పారు. నేపాల్ క్రికెట్ అసోసియేషన్ అతడిని జట్టు నుంచి తప్పించింది.

అత్యాచార ఆరోపణలపై లమిచానేను అరెస్ట్ చేయాల్సిందిగా గత ఏడాది ఖాట్మండ్ పోలీసులు అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. కరేబియన్ లీగ్ లో జమైకా తల్లావాస్ జట్టు తరఫున ఆడటానికి సందీప్ వెస్టీండీస్ వెళ్లాడు. తిరిగి ఖాట్మండ్ కు రాగానే పోలీసులు అరెస్ట్ చేశారు. అతడు దోషి అని తేలగానే ఫ్రాంచైజీ వెంటనే జట్టు నుంచి విడుదల చేసింది.

అంతకు ముందు సామాజిక మాధ్యమాల్లో లమిచానే ఓ వీడియో విడుదల చేశారు. తనను తాను నిర్దోషిగా చెప్పుకున్నారు. విచారణకు పూర్తిగా సహకరిస్తామని హమీ ఇచ్చారు. తను చివరి వరకూ న్యాయపోరాటం చేస్తానని, ఇది తనపై ఎవరో పన్నిన కుట్ర అని ఆరోపించారు.

లమిచానే గత జూన్- జూలై లో జింబాబ్వే లో జరిగిన వన్డే ప్రపంచకప్ క్వాలిఫైయర్లో నేపాల్ తరఫున ఆడారు. తరువాత శ్రీలంకలో నిర్వహించిన ఆసియా కప్ లో ఆడారు. లమిచానే ఇప్పటి వరకూ నేపాల్ తరఫున 100 వైట్ బాల్ మ్యాచ్ లలో 100కు పైగా వికెట్లకు పడగొట్టాడు. ఐపీఎల్ తరఫున 2018-20 మధ్యకాలంలో ఢిల్లీ క్యాపిటల్ కు ఆడారు. తొమ్మిది మ్యాచ్ లో 13 వికెట్లు సాధించారు.

Read More
Next Story