చీకటి గుయ్యారం... ఎవరి పాపం
x
silkyara tunnel

చీకటి గుయ్యారం... ఎవరి పాపం

చార్ ధామ్ యాత్ర కోసం సిల్ క్యారా సొరంగంలో పనులు చేస్తూ చిక్కుకున్న కార్మికులను రక్షించే ప్రయత్నాలు రోజురోజుకి సంక్లిష్టంగా మారుతున్నాయి. అసలే చలికాలం కావడం, ఆపై డ్రిల్లింగ్ మెషిన్లు మొరాయిస్తుండటంతో సొరంగంలో చిక్కుకున్న వారిని ఎలా బయటకు తీసుకురావాలనే అంశంపై అధికారులు, రెస్క్యూ సిబ్బంది తలలు పట్టుకుంటున్నారు.


హిమాలయాల్లో పని ప్రదేశం ఉండటంతో, విపరీతమైన చలి ఉందని, ఉదయం ఎనిమిది గంటల వరకూ పని ప్రారంభం కావడంలేదని, సాయంత్రం నాలుగు గంటలకే చీకటి పడుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు డీజిల్ డ్రిల్లింగ్ మెషిన్లతో పనులు చేస్తే వాటి ప్రకంపనలకు సొరంగం మొత్తం కూలే పరిస్థితి ఉందని తేలటంతో పనులు ఆపేశారు.

మరోవైపు అమెరికన్ అగర్ యంత్రం 46 మీటర్లు డ్రిల్లింగ్ చేసింది. అప్పటికే దాన్ని అమర్చిన వేదికకు పగుళ్లు రావడంతో దాన్ని సరిచేసి పనులు తిరిగి ప్రారంభించారు. దాంతో ఇంక ఒక్కరోజులో కార్మికులు బయటకు వస్తారని అంతా భావించారు. కానీ అగర్ యంత్రానికి ఏదో లోహం అడ్డురావడంతో దాన్ని బ్లేడు విరిగిపోయాయి. దాంతో మళ్లీ పని మొదటికి వచ్చింది.

క్రిస్టమస్ కే బయటకా..?

సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను బయటకు తీసుకురావడానికే మరో నెల రోజులు పట్టే అవకాశం ఉందని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. శివాలిక్ శ్రేణుల్లోని హిమాలయాలు పూర్తిగా ఒదులుగా ఉండే మట్టితో నిర్మాణం అయ్యాయి. కావునా తొందరపడి త్వరగా త్వరగా సొరంగాలు చేస్తే పూర్తిగా కుప్పకూలే ప్రమాదం ఉందని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అందుకే ఆలస్యమైనా మంచిదే కానీ సురక్షితంగా కార్మికులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని అంతర్జాతీయ సొరంగాల నిపుణుడు ఆర్నాల్డ్ చెబుతున్న మాట. కొండ పై నుంచి నిలువుగా సొరంగం తవ్వడానికి ఇప్పటికే బీఆర్ఓ అధికారులు రెండు స్థలాలు గుర్తించినట్లు సమాచారం. మరోవైపు అగర్ యంత్రం ఆగిపోయిన చోటు నుంచి మనుషుల సాయంతో సొరంగం తవ్వాలని కూడా ప్రణాళికలు రచిస్తున్నట్ల ఉత్తరాఖండ్ సీఎం ఫుష్కర్ సింగ్ ధామి మీడియాకు వెల్లడించారు.

అగర్ యంత్రాన్ని అడ్డుకున్న లోహన్ని కట్ చేయడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తయారైన ప్లాస్మ కట్టర్ లను తరలించారు. వీటితో ఉదయం పనిని ప్రారంభించినట్లు సీఎం చెప్పారు. సాధ్యమైనన్నీ అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారిని సురక్షితంగా బయటకు తెస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రధాని కార్యాలయం కూడా రోజువారిగా సహాయ కార్యక్రమాలను పరిశీలిస్తోందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.

Read More
Next Story