రానున్న రోజుల్లో అయోధ్యకు  అన్ని లక్షల మంది భక్తులా?
x

రానున్న రోజుల్లో అయోధ్యకు అన్ని లక్షల మంది భక్తులా?

అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన అయోధ్య రామాలయానికి భక్తులు పొటెత్తుతారా? ఆ సంఖ్యకు అనుగుణంగానే ఆలయ నిర్మాణం జరిగిందా?


అయోధ్య రామాలయ నిర్మాణం తొలిదశ పనులు పూర్తయ్యాయి. జనవరి 22న బాలరాముడు (రామ్‌లల్లా) కొలువదీరనున్నాడు. ప్రధాని మోదీ ఈ వేడుకకు హాజరవుతున్న విషయం తెలిసిందే.

భారీ వ్యయంతో నిర్మిస్తోన్న ఈ ఆలయంలో భక్తులకు ఏర్పాట్లు కూడా అదే స్థాయిలో ఉంటాయంటున్నారు అయోధ్య రామమందిర ప్రాజెక్టు మాస్టర్‌ ‌ప్లానర్‌ ‌దీక్షు కుకేర్జా. ఢిల్లీలోని ఏరోసిటీ, ద్వారకలోని ఇండియా ఇంటర్నేషనల్‌ ‌కన్‌వెన్షన్‌ ‌సెంటర్‌ (ఐఐసీసీ) కూడా ఈయన డిజైన్‌ ‌చేసినవే.

భవిష్యత్తులో రోజుకు 3లక్షల మంది..

వచ్చే మూడు, నాలుగేళ్లలో అయోధ్యకు వచ్చే భక్తుల సంఖ్య 3లక్షల వరకు ఉంటుందని దీక్షు కుకేర్జా అంచనా వేశారు. ఆ సంఖ్యను దృష్టిలో ఉంచుకుని ఆలయ నిర్మాణ పనులు జరిగాయని చెప్పారు. ఆలయ నిర్మాణానికి ముందు ప్రపంచ ప్రసిద్ధ క్షేత్రాలైన వాటిగన్‌ ‌సిటీ, కంబోడియా, జెరుషలేం, ఇండియాలోని తిరుపతి, అమృత్‌సర్‌ ‌గురించి స్టడీ చేశామని చెప్పుకొచ్చారు. అయోధ్య చరిత్రను చాటేలా తక్కువ స్థలంలో సుందరంగా ఆలయాన్ని నిర్మించడం, ప్రత్యేక శ్రద్ధతో ధర్మశాల నిర్మాణం చేపట్టామని పేర్కొన్నారు సీపీ కుకుర్జా అర్కిటెట్స్ ‌మేనేజింగ్‌ ‌ప్రిన్సిపాల్‌ ‌కుకుర్జె. ప్రస్తుతానికి తొలి దశ నిర్మాణపనులు పూర్తయ్యాయని, రూ. 85వేల కోట్లతో నిర్మించనున్న రామాలయం పూర్తి కావడానికి దాదాపు పదేళ్ల సమయం పడుతుందన్నారు.

Read More
Next Story