
ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో రూ.5వేల కోట్ల మోసం..
హైదరాబాద్ డీజీజీఐ దర్యాప్తులో ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో నడిచిన భారీ ఫిన్‌టెక్ నెట్‌వర్క్ వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్‌లో ఆన్‌లైన్ గేమింగ్ ముసుగులో సాగుతున్న భారీ ఫ్రాడ్‌ను పోలీసులు బట్టబయలు చేశారు. దాదాపు రూ.5,000 కోట్లకు పైగా విలువైన గేమింగ్–ఫిన్‌టెక్ నెట్‌వర్క్‌ను డీజీజీఐ జోనల్ యూనిట్ గుర్తించింది. పక్కా సమాచారం రావడంతో అధికారులు దాడులు చేసి ఈ స్కామ్‌ను బహిర్గతం చేశారు. ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో జరుగుతున్న రియల్ మనీ గేమింగ్ కార్యకలాపాలను గుర్తించారు. ఫన్‌ఇన్‌మ్యాచ్360.కామ్(funinmatch360.com), రేస్‌జీత్247.కామ్(racejeet247.com) అనే రెండు ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా ఈ భారీ సిండికేట్ నడుస్తోంది.
దీంతో ఆ రెండు ఫ్లాట్‌ఫార్మ్‌ల లావాదేవీలపై అధికారులు ఫోకస్ పెట్టారు. వాటిని ట్రాక్ చేస్తూ డబ్బు ఎవరి నుంచి ఎవరికి అందుతోంది? ఏ రూపాల ఈ లావాదేవాలు జరుగుతున్నాయి? ఈ లెక్కలను ఎవరు మెయింటెయిన్ చేస్తున్నారు? వంటి వాటిని పరిశీలించారు. ఈ దర్యాప్తులో గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల నుంచి రెండు డొల్ల కంపెనీలకు నిధులు మళ్లినట్లు అధికారులు గుర్తించారు. ఓషనిక్ వెబ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(Oceanique Web Solutions Pvt Ltd), వెబ్‌ఇన్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్(Webwin Solutions Pvt Ltd) అనే డొల్ల సంస్థలకు పెద్ద మొత్తంలో నగదు చేరినట్టు దర్యాప్తులో తేలింది.
అంతేకాకుండా ఈ నెట్‌వర్క్‌తో సంబంధం ఉందన్న అనుమానంతో Wegofin Digital Solution వ్యవస్థాపకులు వైఎస్ ప్రభుకుమార్, రాజశేఖర్ రెడ్డీని విచారించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. ఈ సిండికేట్‌ను విదేశాల నియంత్రిస్తున్నారని, దీని వెనక ఒక అసోసియేట్ ప్రధాన సూత్రధారిగా ఉన్నట్లు అధికారులు భావిస్తున్నారు. ఈ సిండికెట్ మాస్టర్ మైండ్ ఎవరు? అనేది మాత్రం ఇంకా తేలీలేదని అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఆ మాస్టర్‌మైండ్‌ను కనుగొనడం కోసం ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు అధికారులు చెప్పారు.
లావాదేవీల నిర్వహణలో పేమెంట్ అగ్రిగేటర్లు, పేమెంట్ గేట్‌వేలు, థర్డ్ పార్టీ సర్వీసెస్ వాళ్లు కూడా పాత్ర పోషించినట్టు దర్యాప్తు చెబుతోంది. ఆడిట్‌కు అందని విధంగా లావాదేవాలను దాచినట్లు అధికారులు గుర్తించారు. ఆన్‌లైన్ మనీ గేమ్స్‌పై చెల్లించాల్సిన జీఎస్టీని తప్పించుకునేందుకు పేఔట్ ఎస్క్రో ఖాతాలను ఏర్పాటు చేసినట్టు తేలింది. ‘ఆక్షనబుల్ క్లెయిమ్స్’పై పన్ను భారం తప్పించుకునేలా ఈ విధానం ఉపయోగించినట్టు అధికారులు చెబుతున్నారు.
డబ్బు ప్రవాహం నిజమైన వ్యాపార ఆదాయంలా కనిపించేలా షెల్ సంస్థలు, అద్దె బ్యాంక్ ఖాతాలతో పొరలుగా నిర్మాణం చేసినట్టు దర్యాప్తులో వెల్లడైంది. ఈ రూటింగ్ వ్యవస్థల ద్వారానే భారీ మొత్తాలు కదిలినట్టు అధికారులు పరిశీలిస్తున్నారు. ఉద్యోగులు లేదా విక్రేతలకు చేసే బల్క్ చెల్లింపుల కోసం బ్యాంకులు ఇచ్చే పేఔట్ ఏపీఐలను దుర్వినియోగం చేసిన అంశం కూడా అధికారులు దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.
ఓటీపీ లేదా మాన్యువల్ చెక్‌లు లేకుండానే లావాదేవీలు జరిగేలా ఈ వ్యవస్థలను వినియోగించినట్టు గుర్తించారు. ఈ మొత్తం వ్యవహారంలో ఎండ్‌టు–ఎండ్ డబ్బు ప్రవాహం ఎలా సాగిందన్న అంశంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఆధారాల పరిశీలన పూర్తయ్యాక తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

