‘బలమైన ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి’
x
బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోదీ

‘బలమైన ప్రభుత్వంతోనే దేశాభివృద్ధి’

ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, కాశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు.


ప్రధాని మోదీ కాంగ్రెస్‌పై విమర్శలను తీవ్రతరం చేశారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి, కాశ్మీర్‌ను అభివృద్ధి పథంలో నడిపించిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. బలహీనమైన ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితిని మార్చగలదా? అని ప్రశ్నించారు. శనివారం (మే 18) హర్యానాలో లోక్‌సభ ఎన్నికల ర్యాలీనుద్దేశించి ఆయన ప్రసంగించారు.

కాంగ్రెస్ హయాంలో జరిగిన మొదటి కుంభకోణమైన జీపు కుంభకోణాన్ని ప్రస్తావిస్తూ..భారత బలగాలను, సైనికులకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్‌దేనని ఆరోపించారు.

సాయుధ దళాలలో హర్యానా సైనికులు ఎక్కువగా ఉండడాన్నిప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. హర్యానాలో తల్లులు తమ పిల్లల భద్రత గురించి ఆలోచిస్తూ చాలా ఆందోళన చెందేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉందా? అని అడిగారు.

ఫిర్ ఏక్ బార్..

లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్‌ 4న కేవలం 17 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయన్న మోదీ.. మొదటి నాలుగు దశల పోలింగ్‌లో కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్ (ఇండియా)లోని దాని భాగస్వాముల్లో నిత్సేజం అలుముకుందని పేర్కొన్నారు.

‘‘హర్యానావాసుల్లో దేశభక్తి కనిపిస్తుంది. రాష్ట్రం దేశవ్యతిరేక శక్తులను అర్థం చేసుకుంటుంది. హర్యానాలోని ప్రతి ఇల్లు - ఫిర్ ఏక్ బార్" అని అంటోందని మోదీ వ్యాఖ్యానించారు.

'భీఖ్ కా కటోరా'..

‘దేశంలో బలమైన ప్రభుత్వం ఉన్నప్పుడు శత్రువు దాడి చేయడానికి 100 సార్లు ఆలోచిస్తాడు. గతంలో తన చేతుల్లో బాంబులున్న పాకిస్థాన్.. ఇప్పుడు ‘భీఖ్ కా కటోరా’ (భిక్షాటన గిన్నె) ఉంది. ‘ఢకడ్‌ సర్కార్‌కి శత్రువులు భయపడతారు’ అని అన్నారు.

హర్యానాలోని 10 లోక్‌సభ స్థానాలకు మే 25న ఎన్నికలు జరగనున్నాయి. ర్యాలీకి హాజరైన వారిలో హర్యానా మాజీ ముఖ్యమంత్రి, కర్నాల్‌లోని బిజెపి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థి మనోహర్ లాల్ ఖట్టర్, ఆ పార్టీ అంబాలా, కురుక్షేత్ర అభ్యర్థులు, బాంటో కటారియా, నవీన్ జిందాల్ ఉన్నారు.

అంతకుముందు కేంద్ర మాజీ మంత్రి రత్తన్ లాల్ కటారియాకు మోదీ నివాళులర్పించారు. ఆయన గతంలో అంబాలా నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు. కటారియా భార్య బాంటో కటారియా ఈసారి లోక్‌సభ ఎన్నికల అభ్యర్థిగా బీజేపీ తరుపున పోటీ చేస్తున్నారు.

Read More
Next Story