జేఎన్‌యూఎస్‌యూకి ఎన్నికయిన తొలి దళిత అధ్యక్షుడు ధనంజయ్..
x

జేఎన్‌యూఎస్‌యూకి ఎన్నికయిన తొలి దళిత అధ్యక్షుడు ధనంజయ్..

న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నాలుగేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరిగాయి. యునైటెడ్ లెఫ్ట్ మొత్తం నాలుగు సీట్లను గెలుచుకుంది.


న్యూఢిల్లీలోని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ క్యాంపస్‌లో సంబరాలు అంబరాన్నంటాయి. సోమవారం (మార్చి 25) తెల్లవారుజామున వేడుకలు జరిగాయి. JNU స్టూడెంట్స్ యూనియన్ ఎన్నికలలో యునైటెడ్ లెఫ్ట్ మొత్తం నాలుగు సీట్లను గెలుచుకోవడమే ఇందుకు కారణం. నాలుగేళ్ల విరామం తర్వాత ఎన్నికలు జరిగాయి.

ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (AISA)కి చెందిన ధనంజయ్ తన సమీప ప్రత్యర్థి RSS అనుబంధ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP)కి చెందిన ఉమేష్ సి అజ్మీరాను ఓడించి జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (JNUSU) అధ్యక్షుడయ్యాడు.

స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) నుంచి వైస్ ప్రెసిడెంట్‌గా అవిజిత్ ఘోష్, లెఫ్ట్ మద్దతుతో బిర్సా అంబేద్కర్ ఫూలే స్టూడెంట్స్ అసోసియేషన్ (BAPSA) నుంచి ప్రియాంషి ఆర్య ప్రధాన కార్యదర్శిగా, జాయింట్ సెక్రటరీగా లెఫ్ట్ నుంచి మొహమ్మద్ సాజిద్ ఎన్నికయ్యారు.

ధనంజయ్ ఎవరు?

బీహార్‌లోని గయాకు చెందిన ధనంజయ్ యూనివర్సిటీలోని స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ ఈస్తటిక్స్ నుంచి పీహెచ్‌డీ విద్యార్థి. 1996-97లో బట్టి లాల్ బైర్వా తర్వాత వామపక్షాల నుండి JNUSUకి ఎన్నికయిన మొదటి దళిత అధ్యక్షుడు. ధనంజయ్ 922 ఓట్లతో అధ్యక్ష పదవిని దక్కించుకున్నాడు. మహిళల భద్రత, నీరు, మౌలిక సదుపాయాల, స్కాలర్‌షిప్‌ల పెంపు తన ఎజెండా అని ధనంజయ్ పేర్కొన్నారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా పోరాడిన వారు ఎవరైనా ఉన్నారంటే అది వామపక్షాలేనని అన్నారు.

Read More
Next Story