ధోని ఓ మానవాతీత శక్తి: ప్రశంసలు కురిపించిన ఆసీస్ మాజీ ఆల్ రౌండర్
x

ధోని ఓ మానవాతీత శక్తి: ప్రశంసలు కురిపించిన ఆసీస్ మాజీ ఆల్ రౌండర్

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఓ మానవాతీత శక్తి అని ఆసీస్ మాజీ ఆల్ రౌండర్ షేన్ వాట్సన్ ప్రశంసలు కురిపించాడు. ఆయన ఫెడరల్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.


ఆస్ట్రేలియా ఆల్ రౌండర్, మాజీ సీఎస్కే ఆటగాడు షేన్ వాట్సన్ ధోని పై ప్రశంసల వర్షం కురిపించాడు. భారత మాజీ కెప్టెన్ ధోనికి మరో మూడేళ్ల పాటు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉందని అన్నాడు. కచ్చితంగా మరో మూడు ఐపీఎల్ ల్లో మనం ధోని చూస్తామని ఆశాభావం వ్యక్తం చేశాడు ఈ మాజీ సీఎస్కే ఆటగాడు.

2018 లో జరిగిన ఐపీఎల్ ఫైనల్లో వాట్సన్ సన్ రైజర్స్ హైదరాబాద్ పై సెంచరీ సాధించి జట్టును గెలిపించాడు. ఈ విజయం వెనక ధోని ఉన్నాడని షేన్ వాట్సన్ చెప్పుకొచ్చాడు. 42 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ లో ఇప్పటికీ నైపుణ్యాలకు కొదవలేదని వాట్సన్ ప్రశంసించారు.

'ధోనీ రిటైర్మెంట్‌ను ఎప్పుడూ కోరుకోను'
“ఎంఎస్ ధోని ప్రస్తుతం ఆడుతున్న విధంగా, అతను మరో రెండేళ్లు ఆడగలడు. నేను ఎప్పుడూ చూడనంత బాగా ఆడుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్‌లో ఇప్పటివరకు మనం చూసిన కొన్ని షాట్‌లు సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉన్నాయి” అని వాట్సన్ గురువారం ది ఫెడరల్‌కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో చెప్పారు.
"గత రెండేళ్ళలో, మేము అతని బ్యాటింగ్ లో ఒక శైలిని మాత్రమే చూశాము, అయితే ఈ సీజన్‌లో అతను బ్యాటింగ్‌కు వచ్చిన ప్రతిసారీ, ధోని లో ఉన్న అత్యుత్తమ నైపుణ్యాలు బయటపడ్డాయి. అతను అనూహ్యంగా చూడని చక్కని షాట్లు, మంచి ఫుట్ వర్క్ తో ఆడుతున్నాడు. ఈ సంవత్సరం ధోని ఆటతీరును చూస్తే మరో మూడేళ్ల పాటు అతను జట్టుతో ఉండగలడు. ”అని ఆస్ట్రేలియా మాజీ ఆల్ రౌండర్ వివరించాడు.
'ది విన్నర్స్ మైండ్‌సెట్' అనే కొత్త పుస్తకాన్ని రచించిన వాట్సన్, ఈ ఏడాది ఐపీఎల్‌లో ధోని ఎలా రాణిస్తున్నాడనే దానితో తాను ఆశ్చర్యపోలేదని ధోనిని "అతీత మానవుడు"గా అభివర్ణించాడు.
"అయితే, ధోని ఐపిఎల్ ఆడటం మాకు చాలా ఇష్టం. అతను మైదానంలో, దాని వెలుపల మానవాతీతుడు. అతను క్రికెట్‌కు అందించే ఆనందంతో, క్రికెట్ అభిమానులుగా మేము అతను రిటైర్ అవ్వాలని ఎప్పుడూ కోరుకోలేమని వాట్సన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
“42 ఏళ్ల వయస్సులో ధోనిని ఇలా చూడటం ఆనందంగా ఉంది. నేను, అతను ఒకే వయస్సులో ఉన్నాం. కానీ నేను ధోని చేస్తున్నట్లు చేయలేను, ఇది కొంచెం ప్రత్యేకమైంది. నేను స్థిరంగా ఇలా చేయలేను. ధోని గురించి కొత్త విషయాలు తెలుసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించదు. ఎందుకంటే అతను మానవాతీత నైపుణ్యాలు కలిగిన వ్యక్తి, ”అని అతను అభిప్రాయపడ్డాడు.
'ధోని అతీంద్రియ నైపుణ్యాలు'
ధోనీలాగే 42 ఏళ్ల వయసున్న వాట్సన్ కూడా సంవత్సరంలో నెలరోజులు ఆడే ఐపీఎల్ ను ఆడాలని నిర్ణయించుకున్నాడు. కానీ తను ధోని లాగా ఆడలేని ఒప్పుకున్నాడు. ఎందుకంటే ధోనిది సూపర్ నాచురల్ శక్తి అని కొనియాడారు.
"ఇది నిజంగా క్రేజీ. నేను అంతర్జాతీయ క్రికెట్ ఆడటం మానేసినప్పుడు, ఓ విషయం గ్రహించాను. అదేంటంటే.. ఐపీఎల్ ఆడాలంటే.. నేను ఏడాదంతా క్రికెట్ ఆడుతూనే ఉండాలని, ప్రపంచంలో ఉత్తమ క్రికెటర్లు పోటీ పడుతున్న ఈ టోర్నీలో నేను వెనకబడిపోకుండా ఉండాలంటే నిరంతరం మ్యాచ్ ప్రాక్టీస్ ఉండాలని కోరుకున్నాను.
కానీ ధోని కేవలం ఐపీఎల్ ఆడుతూ.. తన అత్యుత్తమ నైపుణ్యాలు ప్రదర్శిస్తున్నాడు. ఉత్తమ ఆటగాళ్లను సైతం లెక్క చేయకుండా ధోని ఆడే క్రికెట్ ను చూస్తే ఇది మానవాతీత ప్రదర్శనకాక మరేంటీ? అలాంటి ప్రదర్శనలను సంవత్సరానికి ఒకసారి ప్రారంభించేందుకు తనకు ఎలాంటి ప్రిపరేషన్ అవసరమో అతనికి తెలుసు, అది చాలా సవాలుగా అనిపించినందున నేను చేయలేకపోయాను. అందుకే ఏడాది పొడవునా ఆడుతూనే ఉన్నాను' అని వాట్సన్ అన్నాడు.
IPL 2024లో, ధోని ఎనిమిది ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ కు రాగా ఇందులో ఒక్కసారి మాత్రమే అవుట్ అయ్యాడు (మే 1న పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రనౌట్). అతను ఇప్పటివరకు కేవలం 48 బంతుల్లో 229.16 స్ట్రైక్ రేట్‌తో 110 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సిక్సర్లు, 10 ఫోర్లు కొట్టాడు. IPL 2024కి ముందు, ధోని CSK కెప్టెన్సీ నుండి వైదొలిగి రుతురాజ్ గైక్వాడ్‌కు పగ్గాలు అప్పగించాడు.
Read More
Next Story