చెన్నై అభిమానులకు షాక్ ఇచ్చిన ధోని
x

చెన్నై అభిమానులకు షాక్ ఇచ్చిన ధోని

ఐపీఎల్ ప్రారంభానికి ముందే సీఎస్ కే అభిమానులకు షాక్ తగిలింది. కెప్టెన్, మిస్టర్ కూల్ ధోని సీఎస్ కే కెప్టెన్ గా తప్పుకున్నాడు. కొత్త కెప్టెన్ గా..


ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ ఎవరంటే ఠక్కున గుర్తుకు వచ్చే పేరు ధోని. తమిళప్రజలు కూడా ధోనిని తమ సొంత ఇంటి మనిషిలా ఆదరిస్తారు. తమిళ తంబీలతో ధోని అనుబంధం అలాంటిది. ఈ అనుబంధానికి కారణం సీఎస్కే అని మనందరికి తెలుసు. అలాంటి జట్టుకు ధోని తప్ప ఎవరిని కెప్టెన్ గా చేసిన ఫ్యాన్స్ ఒప్పుకోరు. అయితే కాలం ఆగదు కదా..

అంతకుముందు సీజన్ లో ఒకసారి జడేజాను కెప్టెన్ చేసి సీఎస్ కే ప్రయోగాలు చేసి చేతులు కాల్చుకుంది. తరువాత తిరిగి ధోనినే జట్టు సారథ్య బాధ్యతలు తీసుకున్నాడు. అయితే ఇప్పటికే 42వ ఏటా అడగుపెట్టిన ధోని తనదైన శైలిలో ఆడలేకపోతున్నాడు. అందుకే జట్టుకు కొత్త కెప్టెన్ గా ఒపెనర్ రుతురాజ్ గైక్వాడ్ ను నియమిస్తున్నట్లు సీఎస్ కే ప్రకటించింది. "IPL 2024 చెన్నై సూపర్ కింగ్స్ (CSK) MS ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్‌ను కెప్టెన్‌గా నియమించినట్లు" గురువారం అధికారికంగా ప్రకటించింది.
IPL అధికారిక X (ట్విట్టర్) హ్యాండిల్ నుంచి ఈ ప్రకటన వచ్చింది. ఇది "@చెన్నైఐపిఎల్ కెప్టెన్ - @Ruutu1331ని సమర్పిస్తున్నాను" అని తెలియజేసింది.
CSK ఒక ప్రకటనలో, "MS ధోని TATA IPL 2024 ప్రారంభానికి ముందు రుతురాజ్ గైక్వాడ్‌కు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్సీని అప్పగించాడు. రుతురాజ్ 2019 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌ తరఫున ఆడుతున్నాడు. IPLలో రుతురాజ్ 52 మ్యాచ్‌లు ఆడాడు. రేపు (మార్చి 22) చెన్నైలో జరిగే IPL 2024 ఓపెనర్‌లో, CSK రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో తలపడుతుంది.

Read More
Next Story