ధోని సర్జరీ చేయించుకోనున్నాడా? ఎందుకు ?
x

ధోని సర్జరీ చేయించుకోనున్నాడా? ఎందుకు ?

భారత లెజెండరీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి గాయమైందా? సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్నాడా? ఆ తరువాతే ఐపీఎల్ లో కొనసాగేదీ లేనిదీ తెలుస్తుందా?


భారత్, చెన్నై సూపర్ కింగ్స్ (సిఎస్‌కె) మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీకి గాయమైందా.. సర్జరీ కోసం విదేశాలకు వెళ్తున్నాడా? అంటే అవుననే అంటున్నారు సీఎస్కే, బీసీసీఐతో దగ్గరి అనుబంధం ఉన్న పలువురు అధికారులు. లండన్ లో శస్త్ర చికిత్స చేయించుకోవడానికి ధోని బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ఎటువంటి ప్రకటన గానీ, సమాచారం గానీ బయటకు రాలేదు. దీనిపై ఓ మీడియా సంస్థ ఓ కథనం ప్రచురించింది.

IPL 2024 నుంచి CSK ఎలిమినేట్ అయిన రెండు రోజుల తర్వాత ఈ వార్త బయటకు వచ్చింది. మే 18న, శనివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB)తో జరిగిన మ్యాచ్ లో చెన్నై ఓడిపోయింది. దాంతో డిఫెండింగ్ ఛాంపియన్‌, ప్లేఆఫ్‌లకు అర్హత సాధించకుండానే వెనుదిరిగింది.
ఇప్పటికే ధోనీ తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడి ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే, అతని రిటైర్మెంట్‌పై ఇంకా అధికారిక ధృవీకరణ లేదు. ధోని భవిష్యత్తు ప్రణాళికలపై తమకు ఎలాంటి సమాచారం లేదని CSK టీమ్ మేనేజ్‌మెంట్ కూడా ఇప్పటికే ధృవీకరించింది.
ఇప్పుడు, ఒక మీడియా సంస్థ నివేదిక ప్రకారం, ఒక సోర్స్ ను ఉటంకిస్తూ, ధోని తన కండరాల గాయానికి శస్త్రచికిత్స చేయించుకోవడానికి లండన్ వెళ్తున్నాడని, ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు కథనంలో వివరించింది. ధోని చాలాకాలంగా కండరాల సమస్యతో బాధపడుతున్నట్లు సమాచారం.
“ధోని ఐపిఎల్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడినట్లు వార్తలు వచ్చాయి. అప్పుడే శస్త్రచికిత్స కోసం లండన్ వెళ్లవచ్చని పుకార్లు వచ్చాయి. అతను పూర్తిగా ఫిట్‌గా లేడు, కానీ క్రికెట్‌ను కొనసాగించాలనుకుంటున్నాడు. చికిత్స తర్వాత మాత్రమే అతను తన భవిష్యత్తు గురించి నిర్ణయిస్తాడు, అతను కోలుకోవడానికి ఐదు నుంచి ఆరు నెలల సమయం పడుతుంది, ”అని నివేదిక ప్రకారం వర్గాలు తెలిపాయి.
గత ఏడాది కూడా, IPL 2023 పూర్తయిన తర్వాత, ధోనీకి ముంబైలో మోకాలి శస్త్రచికిత్స జరిగింది. ఐపీఎల్ 2024 మ్యాచ్‌ల సమయంలో ధోనీ కొన్నిసార్లు కుంటుతూ కనిపించాడు. అయినప్పటికీ, అతను CSK కోసం మొత్తం 14 మ్యాచ్ లు ఆడాడు. ధోని మొత్తం 11 ఇన్నింగ్స్‌లలో 220.54 స్ట్రైక్ రేట్‌తో 161 పరుగులు చేశాడు. అందులో 14 ఫోర్లు, 13 సిక్సర్లు ఉన్నాయి. IPL 2024లో ఎనిమిది ఇన్నింగ్స్‌లలో నాటౌట్‌గా నిలిచాడు.
ఈ ఐపీఎల్ మ్యాచ్ లు చూసినట్లు వాళ్ల అందరికి ఒక విషయం తెలుసు. ధోని చివరిగా మాత్రమే బ్యాటింగ్ చేయడానికి వచ్చే వాడు. కనీసం 20 బంతులను ఎదుర్కొనేలా జట్టు ప్రణాళికలు రచించింది. వికెట్లు ముందుగా పడ్డ కూడా ధోని కాకుండా ఇతర బ్యాట్స్ మెన్ లు ముందుగా వచ్చేవారు. దీంతో ధోనికి గాయమైందని అప్పట్లో అనేక వార్తలు వచ్చాయి. అయితే వీటిని సీఎస్కే యాజమాన్యం ఖండించింది. చివరకు ధోని లండన్ వెళ్లడానికి సిద్ధంగా ఉన్నాడని వార్త బయటకు రావడంతో ఇది నిజమని తెలుస్తోంది.



Read More
Next Story