నియంతృత్వ పాలన సాగనివ్వం: కేజ్రీవాల్
x

నియంతృత్వ పాలన సాగనివ్వం: కేజ్రీవాల్

దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఆమోదయోగ్యం కాదన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గత 75 ఏళ్లలో విపక్ష నేతలను జైళ్లలో పెట్టడాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు.


దేశంలో కొనసాగుతున్న నియంతృత్వ పాలన ఆమోదయోగ్యం కాదన్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. గత 75 ఏళ్లలో విపక్ష నేతలను జైళ్లలో పెట్టడాన్ని తాను ఎన్నడూ చూడలేదన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అమృత్‌సర్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి కుల్దీప్ సింగ్ ధాలివాల్‌కు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో ఆయన ప్రసంగించారు. కేజ్రీవాల్ వెంట పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కూడా ఉన్నారు.

దేశంలోని పరిస్థితిని రష్యాతో పోల్చడానికి ఆప్ చీఫ్ ప్రయత్నించారు. "రష్యాలో మాదిరిగా (వ్లాదిమిర్) పుతిన్ ప్రత్యర్థి నాయకులందరినీ జైలుకు పంపారు. కొంతమందిని చంపిచేశారు. ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించి 87 శాతం ఓట్లు సాధించారు. ప్రతిపక్షమే లేనప్పుడు మీకు మాత్రమే ఓట్లు పడతాయి. నన్ను జైల్లో పెట్టారు. మనీష్ సిసోడియాను జైల్లో పెట్టారు. కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాను అటాచ్ చేశారు. టీఎంసీని ఇబ్బంది పెడుతున్నారు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మంత్రులను జైల్లో పెట్టారు. అందరినీ జైల్లో పెట్టండి.. అప్పుడు ఒకే పార్టీ, ఒకే నాయకుడు మిగిలిపోతారు. కానీ ప్రజాస్వామ్యం మనుగడ సాగించలేదు. అలా ఎన్నటికీ జరగనివ్వం’’ అని కేజ్రీవాల్ ఉద్వేగంగా ప్రసంగించారు. పంజాబ్‌లోని మొత్తం 13 లోక్‌సభ స్థానాల్లో ఆప్ విజయం సాధించేందుకు శాయశక్తులా కృషి చేయాలని ఆప్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు, అభిమానులను కేజ్రీవాల్ కోరారు.

Read More
Next Story