ఆదిలాబాద్ తో రవీంద్రనాథ్ టాగూర్ కనెక్షన్ ఎమిటి?
ఆదిలాబాద్ ని విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ ని కొన్ని లక్షల ఏళ్ల కిందట నివసించిన జంతువొకటి దగ్గర చేసింది
బెంగాల్ ఎక్కడ, ఎక్కడి ఆదిలాబాద్. ఇది వినడానికి నక్కకు నాగలోకానికి ఉన్న సంబంధం లాగా లేదూ?
పైకి అలా అనిపిస్తుంది కాని, ఆదిలాబాద్ కు విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ కు సంబంధం ఉంది.
ఎలాగంటే ...
1961లో తెలంగాణాలోని ఆదిలాబాద్ జిల్లాలో ఒక డైనోసార్ అవశేషాలను కనుగొన్నారు. ఇది 18 మీ పొడవుంటుంది. 7 టన్నుల బరువుంటుందని అంచనా వేశారు. ఇది ఎపుడో పురాతన కాలంలో ఈ ప్రాంతంలో బాగా తిరిగిన డైనోసార్.
ఇది మొట్టమొదటిసారి భారతదేశంలో దొరికిన పూర్తిస్తాయి డైనోసార్ అస్తిపంజరం. ఈ డైనోసార్ శాస్త్రీయ నామం బారపాసారస్ టాగోరీ (Barapasaurs Tagorei) . ఎపుడో అంతరించిపోయిన ఒక పురాతన జీవికి రవీంద్రనాథ్ పేరుపెట్టడానికి కారణం ఏమిటి?
ఈ శిలాజం (Fossil) గోదావరి ప్రాణహిత పరీవాహక ప్రాంతంలో 1961లో దొరికింది. నిజానికి ఇది ఆ ఏడాదికి ‘గ్రేట్ డిస్కవరి’ అని జియాలజిస్టులు చెబుతారు.
ఎందుకంటే ఈ డిస్కవరీకి జాతీయ అంతర్జాతీయ ప్రాముఖ్యం ఉంది. కలకత్తాలోని ఇండియన్ స్టాటిస్టిటికల్ ఇన్ స్టిట్యూట్ (ISI) జియోలాజికల్ స్టడీస్ రీసెర్చ్ యూనిట్ వారు ఈ శిలాజాన్నికనుగొన్నారు. ఇది పూర్తి శిలాజం కావడం మరొక విశేషం.
శిలాజాన్ని కొనుగొనింది విశ్వకవి రవీంద్రనాథ్ టాగోర్ శతజయంతి సంవత్సరం కావడంతో దీనికి ఆయన పేరు పెట్టాలనుకున్నారు.
అలా ఆదిలాబాద్,రవీంద్రనాథ్ టాగోర్ ను కలుపుతూ బారపాసారస్ టాగోరి (Barapasaurs Tagorei) అనే పేరు తయారయింది.
బారాపసారస్ టాగోరీ అనేది జురాసిక్ యుగానికి చెందిన Sinemurian Age లో జీవించింది. భూమ్మీదే సంచరించేది. ఇది శాకాహారి. గుడ్లు పెట్టేది.
ఇంత పూర్తిగా చెక్కుచెదరకుండా ఉండే శిలాజం భారతదేశంలో దొరకడం ఇదే ప్రథమం. అంతేకాదు, డైనోసార్ పరిణామానికి సంబంధించి కనిపించకుండా సతాయిస్తున్న ఒక లింక్ దీనితో దొరికినట్లయింది.
ఈ డిస్కవరీకి లండన్ రాయల్ సొసైటీ రు. 15,000 గ్రాంటు ఇచ్చింది. ఈ డిస్కవరీలో పాల్గొన్నవారు.
డాక్టర్ పామెలా రాబిన్సన్, డాక్టర్ ఎలెక్ స్మిత్ ( యూనివర్శటీ ఆఫ్ లండన్), లతోపాటు ఐఎస్ ఐ కి చెందిన డాక్టర్ రాయ్ చౌదరి, డాక్టర్ ఎస్ ఎల్ జైన్, తపన్ కుమార్ చౌదరి.
ఈ విషయాన్ని పర్వీన్ కాశ్వాన్ అనే ఇండియన్ ఫారెస్టు సర్వీస్ అధికారి ఆ మధ్య ట్విట్లర్ లో పేర్కొన్నారు. భారపారస్ అనే పదానికి అర్థం ఏమిటంటే బార అంటే పెద్ద,భారీ అని,పా అంటే పాదాలు. సారస్ అనే గ్రీకు మాటకు అర్థం బల్లి అని. అన్నికలిపితె ఇదిపెద్ద కాళ్లున్న బల్లి .
Many people must be wondering about Dinosaurs in India. India has rich ecological history with presence of dinosaurs. In Gandhinagar (one of the biggest site for dinosaur fossils) & Sirmaur in HP we have fossil parks about them. In Kolkata museum we have dinasaur skeletons.
— Parveen Kaswan, IFS (@ParveenKaswan) October 22, 2019