కలవరపెడుతున్న ‘మిచౌంగ్’ తుఫాన్
x
అల్లకల్లోలంగా ఉన్న సముద్రం

కలవరపెడుతున్న ‘మిచౌంగ్’ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ మిచౌంగ్ తీవ్ర తుఫాన్ గా బలపడింది. రేపు ఉదయం మచిలీపట్నం- బాపట్ల మధ్య తీరం దాటే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది.


తీరం దాటే సమయంలో 110 కిలో మీటర్ల వేగంలో భారీ గాలులు వీస్తాయని చెప్పారు. ప్రస్తుతం మిచౌంగ్ గంటకు పదికిలోమీటర్ల వేగంతో సముద్రంలో కదులుతోంది. తుఫాన్ బాపట్లకు 300 కిలో మీటర్ల దూరంలో, నెల్లూరు కు 100, చెన్నైకి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. తీరం దాటే సమయంలో కుండపోతగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. తుఫాన్ ప్రభావంతో ఏపీలో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతిలో మెట్లదారిని మూసివేసింది. దాదాపు 200 మిల్లిమీటర్ల వర్షం కురుస్తుండటంతో మెట్లదారిని మూసివేసినట్లు టీటీడీ ప్రకటించింది.

సీఎం జగన్ సమీక్ష

మింగ్ చౌ తుఫాన్ నేఫథ్యంలో తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రాణ ఆస్థి నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని సూచించారు. పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహరం అందించాలని చెప్పారు. తుఫాన్ ప్రభావంతో ఇళ్లు దెబ్బతింటే రూ.10 వేలు పరిహారం అందించాలని ఆదేశించారు.

బంగాళఖాతంలో ఏర్పడిన మిచౌంగ్ తుఫాన్ ఏపీ వైపు దూసుకు వస్తోంది. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఏపీ వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం క్రమంగా బలపడి తుఫాన్ గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మిచౌంగ్ వాయువ్య దిశగా కదులుతోంది. దీని ప్రభావంతో వచ్చే రెండు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ ప్రభుత్వం సూచించింది. మరోవైపు అధికార యంత్రాంగాన్ని అలర్ట్ చేసింది.

తుఫాన్ ప్రభావంతో తీరంలో 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లోద్దని అధికారులు హెచ్చరించారు. మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తిరుపతి జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. వరికుప్పలను జాగ్రత్త చేసుకోవాలని అధికారులు రైతులకు సూచించి, అందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. తుఫాన్ ప్రభావంతో తమిళనాడు వ్యాప్తంగా కుండపోతగా వర్షాలు కురుస్తున్నాయి. రోడ్లన్నీ వాగులను తలపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటించింది. తీర ప్రాంత కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించింది. ప్రజల కోసం జిల్లా కేంద్రాల్లో హెల్ప్ లైన్లు ఏర్పాటు చేసింది.

Read More
Next Story