
మున్సిపల్ ఓటర్లు ఎంతమందో తెలుసా ?
మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52.43 లక్షల మంది ఓటర్లున్నారు
తొందరలోనే జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్ల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 117 మున్సిపాలిటీలు, ఆరు మున్పిపల్ కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో కలిపి 52.43 లక్షల మంది ఓటర్లున్నారు. వీరిలో 25.62 లక్షల మంది పురుషులు, 26.80 లక్షలమంది స్త్రీ ఓటర్లున్నారు. అలాగే ఇతర ఓటర్లు 640 మంది ఉన్నట్లు కమిషన్ తెలిపింది. నిజామాబాద్ కార్పొరేషన్లో అత్యధికంగా 3,48, 051 మంది ఓటర్లుండగా, కొత్తగూడెం కార్పొరేషన్లో తక్కువగా 1.34 లక్షలమంది ఓటర్లున్నారు. ఆదిలాబాద్ మున్సిపాలిటీలో అత్యధికంగా 1.43 లక్షల మంది ఓటర్లుండగా, అమరచింత మున్సిపాలిటీలో అతి తక్కువగా 9,147 మంది ఓటర్లున్నారు. వార్డులు, ఛైర్మన్ స్ధానాలకు రిజర్వేషన్లు ఖరారైన తర్వాత నోటిఫికేషన్ విడుదల కాబోతోంది. జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రిజర్వేషన్లను ఫైనల్ చేయబోతున్నారు

