
‘పీఎన్జీ’ పై పెరిగిపోతున్న ఆసక్తి
పైప్డ్‌నేచురల్‌గ్యాస్‌లో సిలిండర్లు, డెలవరీలు, బుక్ చేసుకోవటాలుండవు. డైరెక్టుగా మనింట్లో కిచెన్‌లోని స్టౌవ్‌కు పీఎన్జీ పైపును కనెక్ట్ చేస్తారు.
గల్ఫ్ యుద్ధం నేపధ్యంలో సడెన్ గా పైప్డ్ నేచురల్ గ్యాస్(పీఎన్జీ)పై పెద్దఎత్తున చర్చలు జరుగుతున్నాయి. ఇపుడు నగరంలో కావచ్చు లేదా రాష్ట్రం మొత్తంమీద అందుబాటులో ఉన్నది రెగ్యులర్ గ్యాస్ కనెక్షన్లు మాత్రమే. అంటే సిలిండర్ల ద్వారా గ్యాస్ ను ఇంటికి తీసుకొచ్చి డెలవరీ చేయటమే. గ్యాస్ రెండురకాలుగా సరఫరా అవుతోంది. మొదటిదేమో ఎల్పీజీ అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. సిలిండర్లలో నింపి ఇళ్ళకు తీసుకొచ్చి డెలవరీ చేస్తారు. దీనికి స్టైవ్‌లను కనెక్ట్‌చేసుకుని వాడుకోవాలి. ఎల్పీజీ అయిపోయినపుడల్లా గ్యాస్‌డీలర్లకు ఫోన్‌చేసి బుక్ చేసుకోవాల్సుంటుంది.
ఇక రెండోది పీఎన్జీ అంటే పైప్డ్‌నేచురల్‌గ్యాస్‌లో సిలిండర్లు, డెలవరీలు, బుక్ చేసుకోవటాలుండవు. డైరెక్టుగా మనింట్లోని కిచెన్‌లో స్టౌవ్‌కు పీఎన్జీ పైపును కనెక్ట్ చేస్తారు. అవసరమైనపుడు స్టౌవ్‌బర్నర్ ను తిప్పుకుని ఉపయోగించుకోవటమే. ఇంటిబయట గ్యాస్ మీటర్ పెడతారు. గ్యాస్ మీటర్ నుండి పైపు వేసి ఇంట్లోని స్టౌవ్ కు డైరెక్టుగా కనెక్ట్ చేస్తారు. ఎల్పీజీ కన్నా పీఎన్జీ చాలా క్లీన్ అండ్ సేఫ్ అని నిపుణులంటారు. గ్యాస్ అయిపోయింది బుక్ చేయటం మరిచిపోయామనే బాధే అవసరంలేదు. ఎందుకంటే 24గంటలు, 365రోజులు పీఎన్జీ నిరంతరంగా సరఫరా అవుతునే ఉంటుంది. మంచినీళ్ళ పైపులో నుండి నీరు నిరంతరం సరఫరా అవుతున్నట్లే పీఎన్జీ పైపుల్లో గ్యాస్ సరఫరా అవుతునే ఉంటుంది.
అభివృద్ధి చెందిన దేశాలతో పాటు మనదేశంలోని చాలా నగరాల్లో పీఎన్జీ వైపు జనాలు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాదులో పీఎన్జీ వ్యవహారాలను ‘భాగ్యనగర్‌గ్యాస్‌లిమిటెడ్’ పర్యవేక్షిస్తోంది. నగరంలో 3 లక్షల పీఎన్జీ కనెక్షన్లను ఇవ్వాలని టార్గెట్‌గా పెట్టుకున్నది. అయితే, టార్గెట్ పెట్టుకున్నంత తేలికకాదు కనెక్షన్లు ఇవ్వటం. 2016లో పీఎన్జీ అధికారికంగా ప్రారంభమైంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులో భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఒక భాగం. మొదట పరిశ్రమలు, కమర్షియల్ యూనిట్లతో పీఎన్జీ మొదలైంది. మొదటిదశ సక్సెస్ అయ్యిందనే ఫీడ్ బ్యాక్ తో డొమెస్టిక్ కనెక్షన్లను కుకట్ పల్లి, మియాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్ ప్రాంతాల్లో ప్రారంభించారు.
ఎన్ని కనెక్షన్లు ఉన్నాయి ?
పీఎన్జీ చాలా మెల్లిగా నగరంలో విస్తరిస్తోంది. కారణం ఏమిటంటే దీనికి భూగర్భంలో చాలా పటిష్టమైన పైప్ లైన్ వేయాల్సుంటుంది. అందుకనే నగరంలో కాకుండా కొత్తగా డెవలప్ అవుతున్న ప్రాంతాల్లోనే పీఎన్జీ నెట్ వర్క్ వేగంగా డెవలప్ అవుతోంది. ఇప్పటికి సుమారు 1.5 కనెక్షన్లు ఉండవచ్చని అంచనా. అందుబాటులోని సమాచారం ప్రకారం షామీర్ పేట్, మేడ్చల్, కొంపల్లి, జీడిమెట్ల, సుచిత్ర, కుత్బుల్లాపూర్, అల్వాల్, నిజాంపేట్, చింతల్, బాలానగర్లోని కొన్ని ఏరియాల్లో పీఎన్జీ కనెక్షన్లు ఉన్నాయి. అలాగే కుకట్ పల్లి-వెస్ట్ హైదరాబాద్ జోన్లోని కుకట్‌పల్లి, ప్రసాంతినగర్, వసంత్ నగర్, సర్దార్ పటేల్ నగర్, మలేషియా టౌన్‌షిప్ లోని కొన్ని ఏరియాల్లో అందుబాటులో ఉంది.
అలాగే ఐటిక్యారిడార్లోని హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, మియాపూర్ లోని కొన్నిఏరియాల్లో కూడా అందుబాటులో ఉంది. పీఎన్జీ ఎక్కువగా కొత్తగా వెలుస్తున్న గేటెడ్ కాలనీలు, హైరైజ్ బిల్డింగులు, లగ్జూరియస్ అపార్ట్‌మెంట్లు, విలాసవంతమైన ఇండిపెండెంట్ విల్లాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉంది. పైన చెప్పిన కొత్తగా వెలుస్తున్న నిర్మాణాలు మొదట్లోనే పీఎన్జీ నెట్‌వర్క్ ఏర్పాటుచేసి దానికి తగ్గట్లే పైపులు వేస్తున్నారు. కాబట్టే పీన్జీ సౌకర్యం అందుబాటులోకి వస్తోంది. పీఎన్జీ ఏర్పాటుకు చాలా ఖర్చవుతుంది కాబట్టే ముందుగా బిల్డర్లతో మాట్లాడుకుని దీని నిర్మాణ ఖరీదును కూడా నిర్మాణాల్లో కలిపేస్తున్నారు.
కేంద్రం డెడ్ లైన్
ప్రస్తుత గల్ఫ్ యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్రప్రభుత్వం తాజాగా వినియోగదారులందరినీ ఎల్పీజీ నుండి పీఎన్జీవైపు మారాలని చెప్పింది. ఇందుకు మూడునెలలను గడువుగా కేంద్రం ప్రకటించింది. అయితే కేంద్రం చెప్పినంత సులభంకాదు ఎల్పీజీ నుండి పీఎన్జీకి మారటం.

