
మూడు రోజుల్లో ఎంత మందు తాగారో తెలుసా ?
మొత్తం అమ్మకాల విలువ రు. 1350 కోట్లకు చేరిందంటేనే ఏ స్ధాయిలో మందుబాబులు తాగేశారో అర్ధమవుతోంది.
గడచిన మూడురోజుల్లో తెలంగాణలో ఎంతమందు తాగారో తెలుసా ? అక్షరాల వెయ్యి కోట్లరూపాయల విలువైన మందును ఉఫ్ఫని ఊదిపారేశారు మద్యం ప్రియులు. 2026 కొత్త ఏడాదికి ఆహ్వానం పేరుతో, 2025 సంవత్సరానికి వీడ్కోలు కారణంతో పోయిన డిసెంబర్ 29,30,31 తేదీల్లో లక్షల కేసుల లిక్కర్, లక్షల కేసుల బీరును మందుప్రియులు తాగే పారేశారు. మూడురోజుల్లో 8.30 లక్షల కేసుల లిక్కర్(Liquor) తో పాటు మరో 7.78 లక్షల కేసుల బీరు(Beers) అమ్ముడుపోయింది. 29వ తేదీన 280 కోట్ల రూపాయల విలువైన మద్యం అమ్ముడుపోగా 30వ తేదీన రు. 380 కోట్లు, 31వ తేదీన 315 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
న్యూఇయర్ వేడుకల పేరుతో మద్యంప్రియులు ఫుల్లుగా తాగేశారు. ముఖ్యంగా హోటళ్ళు, పబ్ లు, రిసార్టులు, ఇళ్ళల్లో పార్టీల పేరుతో మద్యం విపరీతంగా కొనుగోలుచేశారు. డిసెంబర్ 25వ తేదీనుండి 31వ తేదీవరకు చూసుకుంటే మొత్తం అమ్మకాల విలువ రు. 1350 కోట్లకు చేరిందంటేనే ఏ స్ధాయిలో మందుబాబులు తాగేశారో అర్ధమవుతోంది.
ప్రతిఏడాది డిసెంబర్ చివరివారంలో ముఖ్యంగా చివరి మూడురోజుల్లో మద్యంఅమ్మకాలు విపరీతంగా జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈసారి మాత్రం అమ్మకాలు గడచిన సంవత్సరాల రికార్డులను బద్దలుకొట్టిందనే చెప్పాలి. ప్రజల్లో ఆడ, మగ తేడాలేకుండా మద్యం తాగటం కామన్ అయిపోతోందనేందుకు ఇలాంటి అమ్మకాలే సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి.

