
ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన దాడులెన్నో తెలుసా...
భారత్ నుంచి పాకిస్తాన్ విడివడిన తర్వాత ఇప్పటికి చెప్పుకోదగిన 7 దాడులు జరిగాయి. అన్నింటా భారతదేశమే విజయం సాధించింది.
భారత్ నుంచి పాకిస్తాన్ విడివడిన తర్వాత ఇప్పటికి చెప్పుకోదగిన 7 దాడులు జరిగాయి. 1947లో భారత్ విభజన జరిగిన తర్వాత ఏకంగా మూడు యుద్ధాలు జరిగాయి. మిగతావన్నీ దాడులుగా పరిగణించవచ్చు.
1947 తర్వాత భారత్ పాకిస్తాన్‌పై చేసిన ప్రధానమైన దాడుల (strikes) లేదా సైనిక చర్యలు (military strikes) క్రింది విధంగా ఉన్నాయి. ఈ strikes అన్నీ అధికారికంగా ప్రకటించినవే.
భారత్ పాకిస్తాన్‌పై చేసిన ముఖ్యమైన దాడులు...
1. 1947-48 - మొదటి ఇండో-పాకిస్థాన్ యుద్ధం. ఇది కాశ్మీర్ కోసం జరిగింది. పాకిస్తాన్ తొలుత దాడి చేసి ఆ తర్వాత మట్టికరిచింది. భారత సైన్యం జమ్మూ కాశ్మీర్ రక్షణ కోసం యుద్ధం చేసి గెలిచింది.
2. 1965 - రెండో ఇండో-పాకిస్థాన్ యుద్ధం. పాకిస్తాన్ 'ఆపరేషన్ జిబ్రాల్‌టర్' ద్వారా కాశ్మీర్‌లోకి చొరబడింది. పాక్ దాడిని భారత్ సమగ్రంగా తిప్పికొట్టింది. పాక్ పై విజయం సాధించింది.
3. 1971 - మూడో ఇండో-పాకిస్థాన్ యుద్ధం. ఇది బంగ్లాదేశ్ విముక్తి ఉద్యమం. తూర్పు పాకిస్తాన్ (ప్రస్తుత బంగ్లాదేశ్) ప్రజలపై దురాగతాలు సాగిస్తున్న నేపథ్యంలో ఈ యుద్ధం జరిగింది. బంగ్లా విముక్తి పోరాట యోధుల తరఫున భారత్ నిలబడింది. శరణార్థుల సమస్య నేపథ్యంలో భారత సైన్యం దాడి చేసి బంగ్లాదేశ్‌ను విముక్తం చేసింది.
4. 1999 - కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైనికులు, ముజాహిదీన్లు (ఉగ్రవాదులు) సరిహద్దు రేఖ దాటి వచ్చి (LOC) కార్గిల్‌లో స్థావరాలు ఏర్పాటు చేశారు. భారత సైన్యం 'ఆపరేషన్ విజయ్' పేరుతో వారిని వెనక్కి తరిమి కొట్టింది.
5. 2016 - సర్జికల్ స్ట్రైక్స్. యూరి దాడిలో 19 భారత జవాన్లు మృతి చెందారు. (Uri Attack) 18 సెప్టెంబర్ 2016న జమ్మూ & కశ్మీర్ రాష్ట్రంలోని బారాములా జిల్లాలోని యూరి సైనిక స్థావరంపై జరిగింది. పాక్ ప్రేరిత జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు ఈ దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో 19 మంది భారత జవాన్లు వీరమరణం చెందారు. దాదాపు 30 మందికి పైగా గాయాలయ్యాయి.1990ల తర్వాత భారత సైనిక స్థావరంపై జరిగిన అత్యంత ఘోరమైన దాడి ఇది. దీనికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుంది. భారతీయ సైన్యంలో ప్రత్యేక దళాలు (Para SF commandos). భారత సైన్యం LOC దాటి, ప్రజలకు తెలిసేలా దాడి చేయడం ఇదే తొలిసారి. సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదాన్ని భారత ప్రభుత్వం అధికారికంగా వాడిన తొలి సందర్భం కూడా ఇదే. 2016 సర్జికల్ స్ట్రైక్స్ ద్వారా భారత ప్రభుత్వం ఉగ్రవాదంపై తన మారిన దృక్పథాన్ని ప్రపంచానికి చాటిచెప్పింది. భారత సైన్యం పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించి విజయం సాధించింది.
6. 2019 - బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది CRPF జవాన్లు చనిపోయారు. బాలాకోట్‌లో జైష్-ఎ-మొహమ్మద్ శిబిరంపై భారత్ సైన్యం వైమానిక దాడి చేసి ఉగ్రవాదుల ఆటకట్టించింది.
7. 2025 ఆపరేషన్ సింధూర్..పహల్గాం దాడికి భారతదేశం ఇచ్చిన జవాబు ఇది. 2025 ఏప్రిల్ 22న, పహల్గాం సమీపంలో మినీ స్విట్జర్లాండ్ గా పిలిచే బైసారన్ లోయ ప్రాంతంలో పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 27మందిని పొట్టనబెట్టుకున్నారు.
అటవీ ప్రాంతం నుంచి చొచ్చుకొచ్చిన నలుగురు ఉగ్రవాదులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి 26 మందిని హత్య చేశారు. మృతుల్లో ఎక్కువ మంది పౌరులు, ఓ 70 ఏళ్ల పింఛన్‌దారుడు, ఓ నేపాలీ పౌరుడు కూడా ఉన్నారు. ఈ దాడికి పాక్‌లో స్థావరాలున్న లష్కరే తోయిబా (Lashkar-e-Taiba) బాధ్యత వహించినట్టు నిఘా సంస్థలు నిర్ధారించాయి.
ఈ దాడి దేశవ్యాప్తంగా, అంతర్జాతీయంగా తీవ్ర సంచలనం రేపింది. “ఈ దాడికి బాధ్యులైన వారిని వదిలిపెట్టం… న్యాయం ఖచ్చితంగా జరగాలి” అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించిన నేపథ్యంలో మే 7న ఈ దాడి జరిగింది. అర్ధరాత్రి దాటిన తర్వాత 1:44 గంటలకు ఈ దాడి జరిగింది. ఈ దాడికి “ఓపరేషన్ సిందూర్” అనే పేరు పెట్టారు. ఈ దాడిలో SCALP మిస్సైల్, HAMMER బాంబులు, Loitering Munitions (గగనతలంలో తేలుతూ లక్ష్యాన్ని గుర్తించి దాడి చేసే డ్రోన్లు) వంటి ఆధునిక ఆయుధాలను ప్రయోగించారు.
లష్కరే తోయిబా, జైష్-ఎ-మొహమ్మద్, హిజ్బుల్ ముజాహిదీన్ వంటి పాక్ మద్దతు కలిగిన ఉగ్రవాద సంస్థల శిక్షణా శిబిరాలు, ఆపరేషన్ కేంద్రాలు ధ్వంసమయ్యాయి. NDTV కథనం ప్రకారం – “ఓపరేషన్ సిందూర్ మొదటి దశ మాత్రమే.” ఇంకా మరికొన్ని దాడులు జరిగే అవకాశం లేకపోలేదు.
మొత్తం ప్రధానమైన దాడులు: 7
మూడు యుద్ధాలు (1947-48, 1965, 1971)
ఒక పరిమిత యుద్ధం (1999 కార్గిల్)
రెండు ప్రత్యేక దాడులు (2016, 2019, 2025)
ఇవి ప్రభుత్వ అధికారికంగా ప్రకటించినవి.
Next Story