ఈసారి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా ?
x
Revanth reddy

ఈసారి తెలంగాణ క్యాబినెట్ మీటింగ్ ఎక్కడ జరుగుతుందో తెలుసా ?

అతిపెద్ద గిరిజన ఉత్సవం జరిగే మేడారంలోనే ముఖ్యమంత్రి(Revanth) ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం ఈనెల 18వ తేదీన జరగబోతోంది


ఈనెలలో జరగబోయే తెలంగాణ మంత్రివర్గ సమావేశం ఎక్కడ జరగబోతోందో తెలుసా ? మేడారంలో, అవును ఆసియా ఖండంలోనే(Medaram carnival) అతిపెద్ద గిరిజన ఉత్సవం జరిగే మేడారంలోనే ముఖ్యమంత్రి(Revanth) ఎనుముల రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశం ఈనెల 18వ తేదీన జరగబోతోంది. సంప్రదాయానికి భిన్నంగా రేవంత్ క్యాబినెట్ సమావేశం సచివాలయం బయట జరగటం బహుశా ఇదే మొదటిసారి. ఈనెల 28వ తేదీన సమ్మక్క-సారలమ్మ మేడారం జాతర ప్రారంభమవుతోంది. జాతరకు సంబంధించిన అభివృద్ధి పనులు దాదాపు పూర్తి కావచ్చాయి.

ముందురోజు అంటే 17వ తేదీన ఉమ్మడి ఖమ్మంజిల్లాలో అభివృద్ది పనులకు శంకుస్ధాపన కార్యక్రమాల్లో పాల్గొంటారు. తర్వాత కాంగ్రెస్ కార్యకర్తల విస్తృతస్ధాయి సమావేశం రేవంత్ అధ్యక్షతన జరుగుతుంది. సాయంత్రం ఖమ్మం నుండి ములుగు జిల్లాలోని మేడారానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి 18వ తేదీ ఉదయం మంత్రులతో కలిసి మేడారం అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించిన తర్వాత సమీక్ష చేస్తారు. సాయంత్రం క్యాబినెట్ సమావేశం మొదలవుతుంది.

19 ఉదయం కొత్తగా నిర్మించిన అమ్మవార్ల ప్రాంగణాలను ప్రారంభిస్తారు. అమ్మవార్ల దర్శనం తర్వాత హైదరాబాద్ చేరుకుంటారు. అదేరోజు సాయంత్రం పెట్టుబడుల ఆకర్షణ కోసం దావోస్ లోని అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సులో హాజరయ్యేందుకు బయలుదేరుతారు. క్యాబినెట్ సమావేశంలో మున్సిపల్, పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ పై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమావేశం.

Read More
Next Story