అయోధ్య రాముడి  మొదటి నెల రాబడి ఎంతో తెలుసా?
x

అయోధ్య రాముడి మొదటి నెల రాబడి ఎంతో తెలుసా?

అయోధ్య రామాలయానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. భక్తులు రామ్‌లల్లాకు కానుకలు భారీగానే సమర్పిస్తున్నారు.


అయోధ్య రామాలయానికి విరాళాలు భారీగా వస్తున్నాయి. భక్తులు రామ్‌లల్లాకు కానుకలు భారీగానే సమర్పిస్తున్నారు. ఒక నెలలో 25 కేజీల బంగారం, వెండి ఆభరణాలు సహా సుమారు రూ. 25 కోట్ల విరాళాలను భక్తులు సమర్పించారని ట్రస్ట్ అధికారులు శనివారం తెలిపారు. వెండి, బంగారంతో చేసిన వస్తువులనే ఎక్కువగా రామ్‌లల్లాకు సమర్పిస్తున్నారని చెప్పారు.

జనవరి 22న రామాలయ ప్రారంభోత్సవం జరిగింది. ఆ తర్వాతి రోజు నుంచి భక్తులను స్వామి దర్శనానికి అనుమతించిన విషయం తెలిసిందే.

ఇప్పటి వరకు 60 లక్షల మంది..

25 కోట్ల మొత్తంలో చెక్కులు, డ్రాఫ్ట్‌లు కూడా ఉన్నాయని రామమందిరం ట్రస్ట్ కార్యాలయం ఇన్‌ఛార్జ్ ప్రకాష్ గుప్తా తెలిపారు. జనవరి 23 నుంచి ఇప్పటి వరకు 60 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఆయన చెప్పారు. శ్రీరామ నవమి వేడుకల్లో ఈ విరాళాలు మరింత పెరుగుతాయని ఆలయ ట్రస్ట్ భావిస్తున్నట్లు గుప్తా తెలిపారు. రామనవమి సందర్భంగా భారీ మొత్తంలో నగదు లెక్కింపునకు వీలుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) నాలుగు ఆటోమేటిక్ హైటెక్ కౌంటింగ్ మెషీన్లను ఏర్పాటు చేసిందని గుప్తా తెలిపారు. త్వరలో రామాలయం ప్రాంగణంలో అన్ని సౌకర్యాలతో కూడిన కౌంటింగ్ గదిని నిర్మిస్తారని చెప్పారు. ..

ఎస్‌బీఐతో ఒప్పందం..

రామ్‌లల్లాకు బహుమతిగా లభించిన బంగారు, వెండి ఆభరణాలు, విలువైన వస్తువుల కరిగింపు, నిర్వహణ బాధ్యతను భారత ప్రభుత్వ మింట్‌కు అప్పగించినట్లు రామాలయ ట్రస్ట్ ట్రస్టీ అనిల్ మిశ్రా తెలిపారు. నగదు జమకు సంబంధించి ఎస్‌బిఐ, ట్రస్ట్ మధ్య ఎంఒయూ కూడా కుదిరిందని చెప్పారు. ఎంఓయూ ప్రకారం విరాళాలు, సమర్పణలు, చెక్కులు, డ్రాఫ్ట్‌లు, నగదు సేకరణ పూర్తి బాధ్యతను ఎస్‌బీఐ తీసుకుంటుందని, వాటిని బ్యాంకులో జమ చేస్తామని తెలిపారు. ఎస్‌బిఐలో ఉద్యోగుల సంఖ్య కూడా పెరిగిందని, వీరు విరాళంగా వచ్చిన నగదును ప్రతిరోజూ రెండు షిఫ్టులలో లెక్కిస్తారని మిశ్రా చెప్పారు.

Read More
Next Story