
బెంగళూరులో తయారైన డ్రైవర్ లెస్ కారు
కారులో ప్రయాణించిన ఉత్తరాది మఠాధిపతి
‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రైవర్ లెస్ కారు బెంగుళూరులో తయారయింది.
ఇది పూర్తిగా భారతీయ సాంకేతిక పరిజ్ఞానంతో, దేశంలోని గుంతల గతుకుల రోడ్లను, రోడ్ల మీద తారస పడే పశువులను దృష్టిలోపెట్టుకుని రూపొందించారు.
2019లో, ఐఐఎస్సి (IISP), విప్రోలు ఈ కారుతయారుచేసేందుకు చేతులు కలిపాయి. ఇపుడు ప్రోటోటైప్ డ్రైవర్‌లెస్ కారును బయటకు వచ్చింది. దీనిని అక్టోబర్ 27 ఆవిష్కరించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆదర్శ హెగ్డే (Adarsh Hegde (@adarshahgd) X లో పోస్టు చేశారు.
Thank you again @moneycontrolcom for quoting my tweet 🙂🙏https://t.co/nh3HpgJPsP https://t.co/oYRkPA9ah4
— Adarsh Hegde (@adarshahgd) October 28, 2025
విప్రో, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), RV కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ లు సంయుక్తంగా ఈ కారును తయారు చేశాయి. ఈ డ్రైవర్‌లెస్ కారుని WIRIN (విప్రో-IISc రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ నెట్‌వర్క్) బెంగళూరులో ఆవిష్కరించారు.
ఆర్ వి కాలేజ్ ఆవరణలో ఈ డ్రైవర్‌లెస్ కారులో ఉత్తరాది మఠానికి చెందిన శ్రీ శ్రీ సత్యాత్మ తీర్థ స్వామీజీ ప్రయాణించారు. ఈ 28 సెకన్ల ప్రయాణం వీడియో వైరల్‌గా మారింది. స్వదేశీ స్వీయ-డ్రైవింగ్ టెక్నాలజీతో నడిచే ఈ కారు కళాశాల క్యాంపస్ అంతటా చక్కగా దూసుకుపోయింది. ఈ కారు తయారీ ప్రాజక్టుకు విప్రో ఆర్థిక సహాయం అందించింది.
Next Story

