ఈ కుటుంబాల్లో ఆనందం తీసుకొచ్చిన ఎన్నికలు
x

ఈ కుటుంబాల్లో ఆనందం తీసుకొచ్చిన ఎన్నికలు

కొన్ని చోట్ల భార్య భర్తలు గెలుపొందగా మరి కొన్ని చోట్ల అత్తాకోడళ్ళు, తండ్రి కుమారులు, తల్లి కుమారుడు విజయం సాధించారు


ఎన్నికల్లో ఒకరు గెలిస్తేనే ఆ కుటుంబం సంతోషం చెప్పనలవి కాదు. అలాంటిది ఒకే కుటుంబంలో పోటీచేసిన ఇద్దరూ గెలిస్తే ఇక ఆనందానికి హద్దులుండవు.

ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు గెలుపొందిన ఉదంతాలు రాష్ట్రంలో అనేకం వెలుగు చూశాయి. కొన్ని చోట్ల భార్య భర్తలు గెలుపొందగా మరి కొన్ని చోట్ల అత్తాకోడళ్ళు, తండ్రి కుమారులు, తల్లి కుమారుడు విజయం సాధించారు.

ఇలాంటి ఉదంతాలు అధికంగా నిర్మల్ జిల్లాలోనూ పట్టణంలో జరిగాయి. నిర్మల్ లోని ఆయేషా కౌసర్ 27 వ వార్డు నుండి పోటీ చేయగా ఆమె భర్త తౌహీరుద్దీన్ కాంగ్రెస్ నుండి గెలుపొందారు. ఇదివరకు జరిగిన ఎన్నికల్లోనూ వీరిద్దరూ ఇదే పార్టీ టికెట్ పై గెలిచారు. 37 వ వార్డు అప్పల గణేష్ చక్రవర్తి, 36 వ వార్డు నుంచి అతని భార్య అప్పాల కావ్య గెలిచారు. భారత గత సరి పాలకవర్గంలో ఛైర్మన్ గా పని చేశారు. అదే జిల్లా లోని భైంసా పట్టణంలో 1 వ వార్డులో ఎం ఐ ఎం నుంచి అబ్దుల్ ఖాదర్, 15 వ వార్డులో ఆయా భార్య ఫర్జానా బేగం గెలిచారు. అబ్దుల్ ఖాదర్ మూడో సరి కౌన్సిలర్ గా గెలిచి హ్యట్రిక్ సాధించారు. మరో ఉదంతంలో నిర్మల్ లో తండ్రి కొడుకులు గెలిచారు. ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఛైర్మన్ ఎండీ జాబీర్ అహ్మెద్, ఆయన కుమారులు నాజర్ అహ్మద్ 17వ వార్డు నుంచి, అమీర్ అహ్మెద్ 2 వ వార్డు నుంచి విజయదుంధుభి మోగించారు. జాబీర్ రెండు సార్లు ఛైర్మన్ గా పనిచేశారు. ఆమెర్ గత పాలక వర్గంలో కౌన్సిలర్ గా పని చేశారు.

మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీ లో ఒకటో వార్డు లో కాంగ్రెస్ అభ్యర్థి గజవాడ లావణ్య గెలిచారు. అనే భర్త నాగరాజు కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచారు. లావణ్య చైర్ పర్సన్ పోటీలో ఉన్నారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల పురాపాలికలోని 15 వార్డులో భారస అభ్యర్థి పై కాంగ్రెస్ అభ్యర్థి కోణతం వెంకటరెడ్డి, నాలుగవ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి మంజుల స్వతంత్ర అభ్యర్థినిపై విజయం సాధించారు. వెంకటరెడ్డి ప్రస్తుతం కాంగ్రెస్ మండల అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో కౌన్సిలర్ గా గెలిచారు.

భారస అభ్యర్థి మేకల సమ్మయ్య, పెద్దపల్లి జిల్లా రామగుండం నగరపాలిక 58 వ డివిజన్ నుంచి, 60 వ డివిజన్ నుంచి ఆయన భార్య మేకల శారద ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థుల పై గెలిచారు. రామగుండం లో భార్య భర్తలు తొలిసారి గెలిచి రికార్డు నిలకొల్పారు. కామారెడ్డి మున్సిపల్ పోరులో 46, 47 వార్డుల్లో గెరిగంటి లక్ష్మీనారాయణ, ఆయన భార్య స్వప్న కాంగ్రెస్ అభ్యర్థులపై గెలిచి భారస తరపున కౌన్సిలర్లుగా గెలిచారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట ఆరో వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి శశికళ గెలవగా ఆమె భర్త 13 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి జూపల్లి రమేష్ బాబు విజయం సాధించారు.

బోధన్ లో కాంగ్రెస్ అభ్యర్థులు శరత్ రెడ్డి, పద్మ 25, 35 వార్డు నుండి భారస, భాజపా అభ్యర్థులపై గెలుపొందారు. గత ఎన్నికల్లో వీళ్ళు కౌన్సిలర్ గా గెలవగా పద్మ చైర్పర్సన్ గా పనిచేశారు. ఇదే మున్సిపాలిటీలో 18, 32 వార్డుల్లో ఎంఐఎం అభ్యర్థులు మీర్ ఇలియాజ్ అలీ, వసీం సుల్తానా స్వతంత్ర, కాంగ్రెస్ అభ్యర్థులపై గెలిచారు. అత్తాకోడళ్ళు వేముల రమాదేవి, నాగలక్ష్మిలు జగిత్యాల జిల్లా ధర్మపురిలో కాంగ్రెస్ అభ్యర్థులు గా 5 వ వార్డు, 14 వ వార్డుల నుండి గెలిచారు. జనగామ లో కాంగ్రెస్ అభ్యర్థి నీరటి రజని 10 వ వార్డు నుంచి భారస నుంచి పోటీచేసిన ఆమె అత్త నెలం శ్రీలత పై గెలుపొందారు. 19 వ వార్డులోని ఇదే మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థి దోర్నాల అనిత, అనే తొడికోడలు అశ్వని స్వతంత్ర అభ్యర్థి గా పోటీ చేశారు. నలుగురు అభ్యర్థులు భారస, భాజపా బరిలో ఉండగా అనిత గెలిచారు. అనితకు 435 ఓట్లు వస్తే అశ్వినికి 44 వోట్లు మాత్రమే వచ్చాయి.

అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ గద్వాల జిల్లా వడ్డేపల్లి పురపాలికలో రాష్ట్రంలో విజయకేతనం ఎగురవేసి ఛైర్మన్ పదవి దక్కించుకుంది. భారసలోని ఒక వర్గం జెడ్పీటీసీ మాజీ సభ్యుడు శ్రీనివాసులు ఆధ్వర్యంలో జాగృతి అధ్యక్షురాలు కవిత సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. అల్ ఇండియా ఫార్వార్డ్ బ్లాక్ సింహం గుర్తు పై జాగృతి తో కలిసి పోటీ చేసి 10 వార్డులలో 8 గెలిచింది.

Read More
Next Story