రేపే విడుదల... ఎలక్షన్ - 2024
x

రేపే విడుదల... 'ఎలక్షన్ - 2024'

అంతా ఆత్రంగా ఎదురుచూస్తున్న 2024 ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రంగం సిద్ధమయింది.


దేశమంతా ఆత్రంగా ఎదరుచూస్తున్న ఎన్నికల షెడ్యూల్ మార్చి 16న శనివారం నాడు విడుదలవుతున్నది.

ఎన్నికల కమిషన్ ఈ విషయం ప్రకటించింది.

ఇద్దరు కొత్త కమిషనర్లుగా జ్ఞానేష్ కుమార్, సుఖ్ బీర్ సింగ్ సందూల నియమాకం తర్వాత ఎన్నికల కమిషన్ కార్యకాలాపాలు ఊవందుకున్నాయి.

శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల కమిషన్ ఎన్నికల షెడ్యూల్ ను విడుదలచేయబోతున్నది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా కమిషన్ ప్రకటించింది.

లోక్ సభ స్థానాలతో పాటు అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి.అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ఉంది.

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ లోని 175 స్థానాలకు ఎన్నికలు జరగాలి. ఈ సారి పోటీ హోరాహోరిగా ఉంటున్నది. మూడు నాలుగు కూటములు తయారయ్యాయి, ఇవన్నీ వేర్వేరుగా అధికారంలో ఉన్న వైసిపితో తలపడుతున్నాయి.



2019 లో మార్చి 10 తేదీన షెడ్యూల్ విడుదలయింది. ఎన్నికల ప్రాసెస్ అంటే పోలింగ్ ఏప్రిల్ పదకొండు నుంచి మొదలయింది. ఇది ఏడుదశల్లో ముగిసింది.

మే 23న ఓట్ల లెక్కింపు జరిగింది.

శుక్రవారం నాడు ఎన్నికల కమిషన్ లో కీలమయిన సమావేశం జరిగింది. ఇందులో పోల్ షెడ్యూల్ ఖరారయినట్లు కమిషన్ వర్గాలు తెలిపాయి.


Read More
Next Story