పర్యావరణ వేత్త  మాధవ్ గాడ్గిల్ మృతి
x

పర్యావరణ వేత్త మాధవ్ గాడ్గిల్ మృతి

దేశంలో పర్యావరణ స్పృహ రగిలించడంలో కీలక పాత్రపోషించిన శాస్త్రవేత్త ఆయన


పశ్చిమ కనుమలపై విలక్షణమైన కృషి చేసి, పర్యావరణ పరిరక్షణ దేశంలో స్పృహ రగిలించేందుకు కృషి చేసిన ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్ (83) బుధవారం రాత్రి స్వల్ప అనారోగ్యంతో పూణేలో కన్నుమూశారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు సిద్ధార్థ గాడ్గిల్ ప్రకటించారు.

"నా నాన్న మాధవ్ గాడ్గిల్ స్వల్ప అనారోగ్యంతో నిన్న రాత్రి పూణేలో మరణించారనే విచారకరమైన వార్తను పంచుకోవడానికి నేను చాలా చింతిస్తున్నాను" అని సిద్ధార్థ గాడ్గిల్ ఒక సంక్షిప్త ప్రకటనలో తెలిపారు.

2023లో "ఎ వాక్ అప్ ది హిల్ లివింగ్ విత్ పీపుల్ అండ్ నేచర్" అనే పేరుతో గాడ్గిల్ ఆత్మకథను రాశారు. దాని పెంగ్విన్ సంస్థ అచ్చేసింది. ఆయన గతంలో ప్రధాన మంత్రి సైంటిఫిక్ అడ్వయిజరీ కమిటీ సభ్యుడిగా ఉన్నారు. పశ్చిమకనుల ఎకాలజీని అధ్యయనం చేసేందుకు వేసిన నిపుణుల కమిటీకి అధ్యక్షుడిగా ఉన్నారు.

గాడ్గిల్ 1942 మే 24న పుణే లో జన్మించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలా మధ్య నిధుల పంపిణీ కి సంబంధించి ఫార్ములా (Gadgil Formula) రూపొందించిన ధనంజయ రామచంద్ర గాడ్గిల్ ఆయన తండ్రి. పుణే ఫెర్గూసన్ కాలేజీ లో చదువుకున్నారు. ముంబై విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రం నుంచి డాక్టరేట్ పొందారు.


Read More
Next Story