ప్రయివేట్ రంగాన్ని ప్రొత్సహించాలన్న ‘ఆర్థిక సర్వే’
x

ప్రయివేట్ రంగాన్ని ప్రొత్సహించాలన్న ‘ఆర్థిక సర్వే’

సహేతుక విధానాలను సూచించడంలో మాత్రం విఫలమయిందా?


సింధు భట్టాచార్య

దేశంలో తయారీరంగం మందగమనంతో సాగుతున్న నేపథ్యంలో ఎగుమతిని పెంచడానికి ప్రయివేట్ రంగాన్ని ప్రోత్సహించాలని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. దానికి గల కారణాలను వెతుకుతూనే చైనాతో పోలికను కూడా ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం వృద్ది రేటు మందగించిందని ప్రధాన ఆర్ధిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్ పార్లమెంట్ లో అంగీకరించారు.

దేశాన్ని వృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలంటే ప్రభుత్వంతో పాటు పరిశ్రమలు, విద్యాసంస్థలు, పరిశోధనా సంస్థలు ఉమ్మడిగా కలిసి నడవాలని ఆర్థిక సర్వే సూచించింది. అయితే దేశాన్ని తయారీరంగానికి గమ్యస్థానంగా మార్చడానికి సూచించిన అంశాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు.
వెనకబడ్డ మేకిన్ ఇండియా..
ఆసక్తికరమైన విషయమేమిటంటే.. గత సర్వే నివేదికల మాదిరిగా కాకుండా ఈసారి కొత్త విషయాలను ప్రస్తావించడానికి అయితే ప్రయత్నం చేశారు. ఇతర దేశాలలో తయారీ సైట్లను అన్వేషించడం ద్వారా ప్రపంచం వాణిజ్యంలో చైనా ఆధిపత్యాన్ని నియంత్రించాలని చూస్తున్న సంపన్న దేశాల ‘చైనాప్లస్ 1’ వ్యూహాన్ని ఇక్కడ ప్రస్తావించలేదు. ప్రపంచ తయారీరంగం చైనా, భారత్ సహ ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకు మారుతున్నట్లు ఐఎంఎఫ్ పరీశీలనలను ఆర్థిక సర్వే కేవలం ప్రస్తావించింది.
అయితే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం అస్తవ్యవస్తమైన తయారీరంగాన్ని వేగవంతం చేయడంలో ఏ మేరకు కృషి చేసిందో ఎక్కడా ప్రస్తావించలేదు.
ఎంవీఏ ఇండెక్స్..
ఎంవీఏ ఇండెక్స్ ను ఆర్థిక సర్వే ప్రస్తావించింది. ఇది ప్రపంచంలో ఉత్పాదక ఉత్పత్తికి ఒక దేశం తయారీరంగం సాపేక్ష సహకారాన్ని కొలుస్తుంది. భారత్ ఇందులో కేవలం -0.2 వద్ద ఉండగా, చైనా మాత్రం 1 కి చేరువగా ఉంది.
అలాగే జీడీపీ శాతం, జీవీలో చైనా కంటే తక్కువగా ఉంది. అంతేకాకుండా తక్కువ, మధ్యస్థ, అధిక ఆదాయం వ్యవస్థలలో కూడా చైనా కంటే భారత్ వెనబడే ఉంది. పారిశ్రామిక ఉత్పత్తిలో ఇంత తక్కువ వాటా ఉన్న మనం ప్రపంచ సరఫరాలో ఎలా పోటీపడాలని అనుకుంటున్నాం?
తగ్గిపోతున్న వృద్ధి..
2024-25 జూలై- సెప్టెంబర్ త్రైమాసికంలో తయారీ రంగం ఎగుమతులు తీవ్ర మందగమనం, అకాల వర్షాల కారణంగా నిర్మాణం, మైనింగ్ వంటి కార్యకలాపాల మందగించడంతో భారతదేశ పారిశ్రామిక వృద్ధి 3.6 శాతానికి క్షీణించింది.
భారతదేశ తయారీ రంగాన్ని కలిగి ఉన్న కొన్ని ప్రధాన ఇన్ పుట్ పరిశ్రమలను ఉదాహారణను తీసుకుంటే.. గత ఆర్థిక సంవత్సరంలో సిమెంట్ తయారీ రంగంలో మూడింట ఒకవంతు నిరుపయోగంగా ఉంది. ప్రభుత్వ వినియోగం మందగించి, అంతర్జాతీయ, దేశీయ ధరల మధ్య పెరిగిన అంతరం కారణంగా ఈ ఆర్థిక సంవత్సరంలో అంటే ఏప్రిల్- నవంబర్ మధ్య దేశంలో ఉక్కు నికర దిగుమతిదారుగా అవతరించింది.
ఇందులో చైనా తరువాత భారతే అతిపెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. అయితే గత ఏడాది సిమెంట్ ఉత్పత్తి కోసం ఏర్పాటు చేసిన సామర్థ్యంలో దాదాపు మూడింట ఒకవంతు నిష్క్రియంగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్- అక్టోబర్ కాలంలో స్థాపిత సామర్థ్యంలో దాదాపుగా 40 శాతం మాత్రమే ఉపయోగించారు.
వస్త్ర పరిశ్రమ..
మూలధన వస్తువులపై కూడా దేశీయ ఉత్పత్తి పెరిగినప్పటికీ దిగుమతులపై ఆధారపడటాన్ని కూడా ప్రస్తావించింది. సాంకేతికత అంతరాయాల కారణంగా మూలధన వస్తువులను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నట్లు తెలిపింది. భారత్ పరిశోధన, అభివృద్ది లో పెట్టుబడులను ప్రారంభించకపోతే ఎలా ముందుకు సాగుతుందనే విశ్లేషలను ఇక్కడ ప్రస్తావించలేదు.
దేశ సరుకుల ఎగుమతుల్లో 8 శాతం వాటా వస్త్ర పరిశ్రమకు ఉంది. అయితే గత ఆర్థిక సంవత్సరంలో ఇందులో కూడా క్షీణత నమోదు అయింది. ఈ రంగాన్ని పీడీస్తున్న అనేక సమస్యలను సర్వే హైలైట్ చేసింది. ఉదాహారణకు వస్త్ర పరిశ్రమ ఎక్కువగా చిన్న సంస్థలే చేపడుతున్నాయి. తద్వారా లాజిస్టిక్ ఖర్చులు పెరిగి ఈరంగం విచ్చిన్నం కావడానికి కారణమవుతున్నాయి.
టెక్స్ టైల్స్ రంగం విదేశీపెట్టుబడులను ఆకర్షించింది. అయితే నైపుణ్యం అనుకున్నంత స్థాయిలో లేకపోవడంతో ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఇక్కడ పోటీతత్వం, ఉత్పత్తిని పెంపొందించడానికి గత సంవత్సరాలలో ప్రభుత్వం చేసిన చర్యలు చాలా తక్కువనే చెప్పాలి. అందుకే దాని దుష్ప్రభావాల పరిణామం ఇప్పుడు స్ఫష్టంగా కనిపిస్తోంది.
సానుకూల పరిణామాలు..
సహజంగానే దేశీయ ఉత్పత్తిని ప్రోత్సహించడానికి, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ప్రొత్సహాకాలు ప్రస్తావించింది. ఆటోమోబైల్స్, ఆటో కాంపోనెంట్స్, వైట్ గూడ్స్ లో ప్రభుత్వ ఉత్పత్తి లింక్డ్ ఇన్సెంటివ్ పథకాల కారణంగా అనేక రంగాలలో సానుకూల పరిణామాలను సర్వే ప్రస్తావించింది. దేశంలో 99 శాతం స్మార్ట్ ఫోన్ లను కూడా ఈ సర్వే ప్రస్తావించింది.
ఆర్ అండ్ డీ నిధులు..
రీసెర్చ్, డెవలప్ మెంట్ పై సర్వే.. ప్రభుత్వ విధానాలు, జోక్యాలను మెచ్చుకుంది. అదే సమయంలో ప్రైవేట్ రంగాన్ని ముందుకు తీసుకురావాలని కోరింది. దేశంలో ఆర్ అండ్ డీ నిధులు ప్రధానంగా ప్రభుత్వ సంస్థ నుంచి సేకరిస్తున్నారు. భారత్ ప్రస్తుతం చేస్తున్న ఖర్చు దక్షిణాఫ్రికా, ఇండోనేషియా కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ, చైనా, బ్రెజిల్, థాయ్ లాండ్ లు మనకంటే ముందున్నాయని ప్రపంచ బ్యాంకు తెలిపిన వాస్తవాన్ని తెలిపింది.
అలాగే చైనా,జపాన్, దక్షిణ కొరియా, యూఎస్ లను కూడా ఆర్థిక సర్వే ఉదాహారణగా చూపింది. అభివృద్ది చెందిన ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం కంటే ప్రయివేట్ రంగమే ఆర్ అండ్ డీలో చాలా మందుందని తెలిపింది. ఇవి పరిశోధన రంగంలో 70 శాతం ఖర్చు చేస్తూ సానుకూల ఫలితాలు పొందుతున్నాయని వెల్లడించింది.
Read More
Next Story