ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..
x
Source: Twitter

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్..

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ అదుపులోకి తీసుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈ అరెస్ట్ చేసింది.


ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు విచారణలో భాగంగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. ఆయనను ఆయన నివాసంలో దాదాపు రెండు గంటలపాటు విచారించిన ఈడీ అధికారులు అనంతరం అదుపులోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. వెంటనే ఆయనను ఈడీ కార్యాలయానికి తరలించారు. ఆయనకు రక్షణ కల్పించడానికి హైకోర్టు నిరాకరించిన గంటల వ్యవధిలోనే ఈడీ ఆయనను అరెస్ట్ చేయడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనంగా మారుతోంది.

లిక్కర్ స్కాం విచారణకు హాజరుకావాలని ఆయనకు పదోసారి సమన్లు జారీ చేయడానికి దాదాపు 12 మంది అధికారుల ఈడీ బృందం ఆయన నివాసానికి చేరుకుంది. అధికారులను అక్కడ ఉన్న కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సమాచారం అందిన వెంటనే భారీ సంఖ్యలో పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అనంతరం ఆప్ శ్రేణులు కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ప్రారంభించారు. దీంతో ప్రస్తుతం కేజ్రీవాల్ నివాసం దగ్గర ఆందోళనకరన పరిస్థితులు నెలకొన్నాయి.
కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో ఇప్పుడు ఢిల్లీ సీఎం పదవి పరిస్థితి ఏంటన్న సందేహాలు తలెత్తాయి. తాజాగా వీటికి ఢిల్లీ మంత్రి అతిశీ క్లారిటీ ఇచ్చారు. అరెస్ట్ అయినా ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ కొనసాగుతారని చెప్పారు. ‘‘కేజ్రీవాల్.. ఢిల్లీ సీఎంగా కొనసాగుతారు. అవసరం అయితే ఆయన జైలు నుంచే ప్రభుత్వాన్ని నడిపిస్తారు. ప్రభుత్వాన్ని జైలు నుంచి నడిపించడకుండా ఆయనను ఆపేలా ఏ రూల్ లేదు’’అని ఆమె వెల్లడించారు.

ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన గంటల్లో వ్యవధిలోనే కేజ్రీవాల్‌ నివాసానికి సెర్చ్‌ వారెంట్‌తో వెళ్లిన ఈడీ అధికారుల బృందం.. ఆయన్ను ప్రశ్నించిన అనంతరం అదుపులోకి తీసుకుంది. మరోవైపు, ఈడీ వైఖరిని నిరసిస్తూ కేజ్రీవాల్‌ ఇంటి వద్ద ఆప్‌ కార్యకర్తల ఆందోళనకు దిగారు. ఈడీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ పరిణామాలతో సీఎం ఇంటివద్ద భారీగా పోలీసులు మోహరించడంతో హైటెన్షన్‌ వాతావరణం నెలకొంది. కేజ్రీవాల్‌ అరెస్టయినప్పటికీ ఆయన సీఎంగా కొనసాగుతారని ఢిల్లీ మంత్రి అతిషీ స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ అరెస్టు పెద్ద కుట్రేనని ఎంపీ రాఘవ్‌ చద్దా అన్నారు.

మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణకు రావాలని ఇప్పటికే ఈడీ తొమ్మిది సార్లు సమన్లు ఇచ్చినా కేజ్రీవాల్‌ హాజరయ్యేందుకు నిరాకరించారు. మరోవైపు, ఈ కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ హైకోర్టులో గురువారం ఊరట లభించలేదు. అరెస్టు నుంచి మినహాయింపు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ప్రస్తుతం ఈ కేసు పురోగతి దృష్ట్యా ఇందులో తాము జోక్యం చేసుకోలేమని చెప్పిన గంటల వ్యవధిలోనే ఈడీ అధికారులు ఆయన ఇంటికి చేరుకుని అదుపులోకి తీసుకున్నారు.

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేజ్రీవాల్‌

ఈ అంశంపై కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం విధానం కేసులో మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ ఆదేశాలిచ్చేందుకు దిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని ఆయన లాయర్లు సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ఈ అంశాన్ని అత్యవసర జాబితాలో చేర్చి గురువారం రాత్రి విచారణ జరిపించేలా లీగల్‌ టీమ్‌ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. అయితే, ఈ పిటిషన్‌పై శుక్రవారం విచారణ చేపట్టే అవకాశం ఉంది.

కేజ్రీవాల్‌ గొంతు అణచివేసేందుకే.. అసెంబ్లీ స్పీకర్‌

కేజ్రీవాల్‌ ఇంటికి ఈడీ అధికారుల రాకపై దిల్లీ అసెంబ్లీ స్పీకర్‌ రాం నివాస్‌ గోయెల్‌ స్పందించారు. మనీశ్‌ సిసోదియాను అరెస్టు చేసినా ఇప్పటివరకు ఏమీ దొరకలేదన్న విషయం అందరికీ తెలిసిందేనన్నారు. ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ గొంతు అణిచివేసేందుకే.. ఆయన్ను అరెస్టు చేయాలని చూస్తున్నారని గోయెల్‌ విమర్శించారు.


Read More
Next Story