
రూ.5,978 కోట్ల మోసంలో కీలక సూత్రధారి అరెస్ట్
అధిక రాబడుల ఆశచూపి ప్రజలకు కుచ్చు టోపీ పెట్టిన హీరా సంస్థ కేసులో కీలక పరిణామం.
భారీ మోసాలకు పాల్పడిన హీరో సంస్థ కేసులో ఈడీ కీలక ముందుగు వేసింది. రూ.5,978 కోట్ల ఈ భారీ మోసంలో కీలక సూత్రధారిని అరెస్ట్ చేసింది. అధిక రాబడులు వస్తాయిన ప్రజలను నమ్మబలికిన హీరా గ్రూప్ సంస్థ.. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని అనేక ప్రాంతాల్లో మోసాలకు పాల్పడింది. ప్రజలకు కల్లబొల్లి కబుర్లు చెప్పి వారికి కుచ్చు టోపీ పెట్టడంలో ఈ సంస్థలో నకిలీ కన్సల్టెంట్ కల్యాణ్ బెనర్జీ కీలక పాత్ర పోషించారు. కల్యాణ్‌ను ఈడీ తాజాగా అరెస్ట్ చేసింది. ఇక ఈ సంస్థ ఎండీ నౌహీరా షేక్‌పై పలు కేసులు నమోదయ్యాయి. ఈ కేసులో అధికారులను బెదిరింపులు, ఒత్తిళ్లకు గురి చేసినట్లు కూడా నౌహీరా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.
ఈ మోసం చేస్తున్న సమయంలో నౌహీరా వినియోగించిన ఫోన్లు, చేసిన వాట్సాప్ యాట్‌లు సహా పలు ఇతర సాక్ష్యాధారాలను ఈడీ అధికారులు సేకరించారు. నౌహీరా ఆదేశాలు, ప్రణాళికల ప్రకారమే అన్నీ చేసినట్లు నకిలీ కన్సల్టెంట్ బెనర్జీ అంగీకరించినట్లు అధికారులు చెప్పారు.
అక్రమ డబ్బులతో ఆస్తుల కొనుగోలు
ఏడాదికి 36శాతం కంటే ఎక్కువ లాభాలు ఇస్తామని హీరా గ్రూప్ ప్రజలను నమ్మించింది. వారి నుంచి పెట్టుబడుల రూపంలో భారీగా నగదు వసూలు చేసింది. ఇలా అక్రమంగా సంపాదించిన నడ్బుతో నౌహీరా.. స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లు ఈడీ నిర్ధారించింది. కేసు విచారణలో భాగంగా ఇప్పటి వరకు రూ.428కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలోనే బాధితులకు డబ్బు తిరిగి ఇవ్వడం కోసం అటాచ్ చేసిన స్థలాలను సుప్రీంకోర్టు అనుమతితో వేలం వేయాలని ఈడీ భావిస్తోంది.
ఈ వేలాన్ని అడ్డుకోవడానికి నౌహీరా ప్రయత్నాలు చేయడంతో ఈ విషయాన్ని ఈడీ తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. దీంతో న్యాయస్థానం నౌహీరాకు రూ.5కోట్ల జరిమానా విధించింది. జరిమానాను ప్రధానమంత్రి సహాయనిధికి జమచేయాలని ఆదేశించింది. కాగా తాజాగా బెనర్జీ అరెస్ట్‌తో ఈ కేసులో ఇంకెన్ని కీలక అంశాలు వెలుగు చూస్తాయోనన్న చర్చ మొదలైంది.

