2019 కంటే ముందటి ఎలక్టోరల్ బాండ్స్ కూడా బయటకొచ్చాయి ..
సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం ఎస్బీఐ సమర్పించిన ఎలక్టోరల్ బాండ్ల జాబితాను ఎలక్షన్ కమిషన్ పబ్లిక్ డొమైన్ లో పెట్టింది.
ఎలక్షన్ కమిషన్ ఆదివారం ఎలక్టోరల్ బాండ్లపై తాజా డేటాను విడుదల చేసింది. ఎస్బీఐ సీల్డ్ కవర్ లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన సమాచారాన్ని తరువాత పబ్లిక్ డొమైన్ లో ఉంచమని ఆదేశించింది. ఈ వివరాలు ఏప్రిల్ 12, 2019కి ముందు కాలానికి సంబంధించినవిగా తెలుస్తోంది. 2019 ఏప్రిల్ నుంచి 2024 వరకు ఉన్న ఉన్న సమాచారాన్ని ఇంతకుముందే ఎలక్షన్ కమిషన్ విడుదల చేసింది.
ఏప్రిల్ 12, 2019 నాటి సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వుల ప్రకారం రాజకీయ పార్టీలు సీల్డ్ కవర్‌లో ఎలక్టోరల్ బాండ్ల డేటాను దాఖలు చేశాయని పోల్ ప్యానెల్ ఒక ప్రకటనలో తెలిపింది.
"రాజకీయ పార్టీల నుంచి స్వీకరించబడిన డేటా సీల్డ్ కవర్‌లను తెరవకుండానే సుప్రీంకోర్టుకు అందించబడింది. మార్చి 15 నాటి ఆదేశాల ప్రకారం సుప్రీంకోర్టులో రిజిస్ట్రీ కొన్ని హర్డ్ కాపీలను అలాగే డిజిటైజ్ చేసిన రికార్డుతో పాటు తిరిగి ఎస్బీఐకి అందించింది. ఎస్బీఐతో పాటు అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కు సైతం మరోకాపీని కోర్టు అందించడంతో వాటిని ఈ రోజు పబ్లిక్ డోమైన్ లో పెట్టారు.
"సీల్డ్ కవర్‌లో పెన్ డ్రైవ్, ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీంకోర్టు రిజిస్ట్రీ నుండి డిజిటలైజ్డ్ రూపంలో అందుకున్న డేటాను భారత ఎన్నికల సంఘం ఈరోజు తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది" అని EC తెలిపింది.
Next Story