తెలంగాణ మూడు జిల్లాల్లో  పులి ఎలెర్ట్...
x

తెలంగాణ మూడు జిల్లాల్లో పులి ఎలెర్ట్...

ఒంటరిగా పొలాలకు వెళ్లొద్దు, అడవిలోకి ప్రవేశించవద్దు... అధికారుల హెచ్చరిక


తెలంగాణలోని మూడు జిల్లాల్లో పులుల ఎలర్ట్ జారీ చేశారు. ఈ ప్రాంతాల్లో పులి సంచరిస్తుండటంలో అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు ఎమర్జన్సీ ఎలెర్ట్ జారీ చేశారు . పెద్దపల్లి, కామారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లోవిడివిడిగా ఈ హెచ్చరికలు జారీ చేశారు. ఒంటరికిగా పొలాల్లోకి వెళ్లడం, అడవిలోకి వెళ్లడం చేయరాదని హచ్చరించారు.

ఇటీవల పెద్దపల్లి జిల్లాలో ఇటీవలే ఒక పెద్ద పులి సంచారం కలకలం రేపింది, ఇది మహారాష్ట్రలోని తాడోబా అంధారీ టైగర్ రిజర్వ్ నుండి మంచేరియల్ జిల్లా మీదుగా వచ్చి ఉంటుందని అంచనా. ఈ పులి రామగుండం ప్రాంతంలోని మెడిపల్లి ఓపెన్-కాస్ట్ గని దగ్గర సంచరిస్తున్నట్లు అడుగుల గుర్తులు కనిపించాయి, దీంతో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై, ప్రజలకు అత్యవసర ఎలెర్ట్ జారీచేశారు. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 9 గంటల మధ్య అటవీ ప్రాంతాలు, పొలాల దగ్గరకు ఒంటరిగా వెళ్లవద్దని హెచ్చరించారు. ఎన్ టిపిసి, మల్యాలపల్లి, కుందన్ పల్లి రాయదండి,లింగాపూర్,పాముల పేట, మేడిపల్లి, రామాపురం, అంతర్గామ్, పాలకుర్తి, ధర్మారం,కమానాపూర్, రామగిరిలో ప్రజలకు ప్రత్యేకంగా హెచ్చరిక జారీ చేస్తూ అటవీ సరిహద్దుల్లో పొలాల్లో పులిసంచరిస్తున్నదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. చీకట్టి పడ్డాక, పొలాల్లోకిగాని,అడవిలోకి గాని ఒంటరిగా వెళ్లరాదని అధికారులు చెప్పారు. పులి పశువులమీద దాడిచేసినా, లేదా పులి అడుగుజాడలు కనిపించినా వెంటనే అధికారలకు సమాచారం ఇవ్వాలని కూడా కోరారు. అదే విధంగా విద్యుత్తీగాలు ఏర్పాటుచేసి పులలను బెదిరించే ప్రయత్నం, పులినిపట్టుకునేందుకు వలవేయడం,విషాహారం ప్రయోగించడం కూడా చేయవద్దని అధికారులు కోరారు.

నాగర్ కర్నూల్ జిల్లాలోకి కొంత భాగం అమ్రాబాద్ పులుల అభయారణ్యం కిందకువస్తుంది.

ఇక కామారెడ్డి జిల్లోని కొన్ని ప్రాంతాల్లో పులి సంచారం ప్రజలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నది. మద్దికుంట గ్రామ శివారు గొల్ల రాజారంలోఒక పులి ఆవులపై దాడి చేసింది. ఇటీవలే దోమకొండ, బీబీపే, బిక్కనూరు మండలాల్లో పలు చోట్ల ఆవులపై దాడి చేసిన వార్తలు వచ్చాయి. సంగమేశ్వర్, పెద్ద మల్లారెడ్డి ప్రాంతాల్లో కూడా రెండు ఆవులను పులి చంపేసింది. అంబారిపేట శివారులో మరోసారి పశువులపై దాడి చేసింది. కామారెడ్డి జిల్లాలోని పాల్వంచ, మాచారెడ్డి, బీబీపేట, దోమకొండ పరిసర ప్రాంతాల్లో పెద్ద పులి తిరుగుతున్నట్లు అధికారులు ధృవీకరించారు.


Read More
Next Story