రాహుల్ గరంగరం :  ఎప్పుడు దర్శించుకోవాలో ప్రధాని నిర్ణయిస్తారా?
x

రాహుల్ గరంగరం : ఎప్పుడు దర్శించుకోవాలో ప్రధాని నిర్ణయిస్తారా?

పాదయాత్రలో ఉన్న రాహుల్‌ గాంధీకి కోపమొచ్చింది. ప్రధానిని టార్గెట్‌ చేస్తూ మాట్లాడారు. ఇంతకు ఏమని మాట్లాడారు. రాహుల్‌ ఆగ్రహానికి కారణమేంటి?


కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ‘‘భారత్‌ జోడ్‌ న్యాయ్‌ యాత్ర చేపడుతున్న విషయం తెలిసిందే. యాత్రలో భాగంగా సోమవారం ఆయన అస్సాంలోని హైబోరాగావ్‌ చేరుకున్నారు. యాత్ర ప్రారంభానికి ముందు శంకర్‌ దేవ్‌ సత్ర ఆలయాన్ని సందర్శించాలనుకున్నారు. అయితే పోలీసులు ఆయనను అనుమతించలేదు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత దర్శనానికి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్‌ నేతలకు మధ్య కొంతసేపు వాగ్వాదం చోటు చేసుకుంది. రాహుల్‌ గాంధీని దర్శనానికి అనుమతి నిరాకరించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్‌మహిళా నేతలు ధర్నాకు దిగారు.

ఆలయంలోకి వెళ్లనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని రాహుల్‌ పోలీసులను ప్రశ్నించారు. ఆలయాన్ని ఎవరు? ఎప్పుడు? సందర్శించాలో ప్రధాని మోదీ నిర్ణయిస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్‌ సేవాదళ్‌ చీఫ్‌ లాల్జీ దేశాయ్‌ మాట్లాడుతూ ఆలయంలో ప్రార్థనలు చేసుకోవడానికి ప్రధాని, అస్సాం ముఖ్యమంత్రి అనుమతించకపోవడం సిగ్గుచేటని అన్నారు. ‘‘ప్రధానమంత్రి అయోధ్యలో పూజ చేసే వరకు, ఎవరినీ దర్శనానికి అనుమతించకపోవడం ఏమిటిని ప్రశ్నించారు. ప్రజలు దేవాలయాలలో ఎప్పుడు ప్రార్థనలు చేయాలనేది ప్రభుత్వమే నిర్ణయిస్తుందని అని మండిపడ్డారు. అసలు దేశంలో ప్రజాస్వామ్యం అంటూ ఉందా అని ప్రశ్నించారు.

Read More
Next Story