పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ కి కౌంట్ డౌన్
x
ఇస్రో ప్రయోగించిన పీఎస్ఎల్వీ.. (ISRO Facebook)

పీఎస్ఎల్వీ సీ-58 రాకెట్ కి కౌంట్ డౌన్

వరుస విజయాలతో మంచి ఊపుమీదున్న ఇస్రో సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. ఈసారి ఎక్స్ రే మూలాల అన్వేషణకు బయలుదేరుతోంది..


వరుస విజయాలతో మంచి ఊపు మీదున్న ఇస్రో సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కొత్త సంవత్సరంలో తొలి రోజే పీఎస్ఎల్వీ- సీ 58ని ప్రయోగించేందుకు సన్నద్ధమైంది. ఆదివారం ఉదయం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. సోమవారం ఉదయం 9.10 గంటలకు శాటిలైట్ ను ప్రయోగిస్తారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) 2024 నూతన సంవత్సరం మొదటి రోజే పీఎస్‌ఎల్‌వీ-సి58 ప్రయోగం చేపట్టేందుకు సన్నాహాలు చేస్తోంది. పీఎస్‌ఎల్‌వీ వాహకనౌక మనదేశానికి చెందిన ఎక్స్‌-రే పొలారిమీటర్‌ ఉపగ్రహం (XPoSat )ను అంతరిక్షంలోకి మోసుకెళ్లనుంది.

సర్వం సిద్ధం...

సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ (శ్రీహరికోట)లో రాకెట్‌ సన్నద్ధత (ఎంఆర్‌ఆర్‌), లాంచ్‌ ఆథరైజేషన్‌ సమావేశాలు జరిగాయి. ఇందులో రాకెట్‌ అనుసంధానం, ఉపగ్రహ అమరిక, పరీక్షలు తదితరాలపై సుదీర్ఘంగా చర్చించారు. కౌంట్‌డౌన్‌ ప్రక్రియ ఆదివారం ఉదయం 8.10 గంటలకు ప్రారంభమై 25 గంటలపాటు కొనసాగి సోమవారం ఉదయం 9.10 గంటలకు పీఎస్‌ఎల్‌వీ-సి58 వాహకనౌక షార్‌లోని మొదటి ప్రయోగ వేదిక నుంచి నింగిలోకి దూసుకెళ్లనుంది. ఇది ఎక్స్‌ పో శాట్‌ను కక్ష్యలోకి వదిలిపెట్టిన తర్వాత పీఎస్‌4 10 ఇతర పేలోడ్‌లను హోస్ట్‌ చేయనుంది.

ఎక్స్ పోశాట్ సంచలనాత్మకం...

ఎక్స్‌ పోశాట్‌ భారతదేశం అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది కానుంది.




ఇమేజింగ్‌, టైం-డొమైన్‌ అధ్యయనాలు, స్పెక్ట్రోస్కొపీపై ప్రధానంగా దృష్టి సారించిన మునుపటి మిషన్ల మాదిరిగా కాకుండా, ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రానికి ఒక కొత్త కోణాన్ని పరిచయం చేస్తూ, ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం ఎక్స్‌ పోశాట్‌ లక్ష్యం. పీఎస్‌ఎల్‌వీ చివరి దశ మరో పది పరికరాలను అంతరిక్షానికి మోసుకెళ్లనుంది. దీనికి పీఎస్‌ఎల్‌వీ ఆర్బిటల్‌ ఎక్స్‌ పెరిమెంటల్‌ మాడ్యూల్‌ (పీవోఈఎం) అని నామకరణం చేశారు.




ఎక్స్‌ పోశాట్‌ భారతదేశ అంతరిక్ష ఆధారిత ఎక్స్‌-రే ఖగోళ శాస్త్రంలో సంచలనాత్మక పురోగతికి నాంది పలుకనుంది. ఎక్స్‌-రే మూలాలను అన్వేషించడం దీని ఈ శాటిలైట్‌ ప్రధాన లక్ష్యం. దీని జీవితకాలం ఐదేండ్లు.

Read More
Next Story