
భక్తుల్ని రెచ్చగొట్టడానికే అలా మాట్లాడారు! : మాజీ ఐఎఎస్
దైర్యం ఉంటే క్షమాపణ చెప్పండి!
తిరుపతి లడ్డూ పవిత్రతపై నిరాధార ఆరోపణలు చేసి, కోట్లాది భక్తుల మనోభావాలను సి.ఎం. చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సి.ఎం. పవన్ కళ్యాణ్ లు గాయపరిచారని మాజీ ఐఏఎస్ అధికారి విజయ్‌కుమార్ మండిపడ్డారు. పంది, గొడ్డు కొవ్వు కలిసిందంటూ బాధ్యతారహిత ప్రకటనలతో సమాజాన్ని రెచ్చగొట్టారని ఆయన విమర్శించారు. ఇప్పుడు సీబీఐ తుది ఛార్జ్‌షీట్ ద్వారా నిజాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఈ ఇద్దరు నేతలు ప్రజలకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గుజ్జు సువర్ణరత్న కరుణాకర రాజేంద్ర (G.S.R.K.R.) విజయ్ కుమార్ తో ఫెడరల్ తెలంగాణా చిట్ చాట్.
ప్రభుత్వంలో ఆయన పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. పేదలు, మధ్యతరగతి, దళిత్, గిరిజన వర్గాల హక్కుల కోసం పోరాటం చేయాలని లక్ష్యంతో రాజకీయ ప్రవేశం చేశారు. ‘Aikyata Vijaya Patham’ పేరుతో భారీ పాదయాత్ర చేశారు. ఆతరువాత లిబరేషన్ కాంగ్రెస్ పార్టీని స్థాపించారు. 2024లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ తరఫున తిరుపతి (SC) లో పార్లమెంట్ ఎన్నికలుకూ అభ్యర్థిగా ఆయన పోటీ చేశారు. కూటమి ప్రభుత్వ భూ కుంభకోణాలు, రాష్ట్ర అప్పులపై ఘాటుగా విమర్శలు చేస్తున్నారు.

