పనామా కెనాల్ దగ్గిర ప్రళయాగ్ని
x

పనామా కెనాల్ దగ్గిర ప్రళయాగ్ని

ఇరాన్ బ్రిడ్జీలు కూలుతున్నపుడు పనామా బ్రిడ్జి మీద మంటలు లేవడం విచిత్రం


పనామా సిటీ సమీపంలోని బ్రిడ్జ్ ఆఫ్ అమెరికా (Bridge of the Americas) దగ్గిర భయంకరమయిన ప్రేలుడు సంభవించింది. ఇందులో ఒక వ్యక్తి చనిపోయినట్లు, ఇద్దరు గాయపడినట్లు సమాచారం. పనామా కెనాల్ పసిఫిక్ సముద్రం మధ్య ఉన్న ఈ బ్రిడ్జి మీద సోమవారం నాడు ఒక అయిల్ ట్యాంకర్ పేలడంతో ఈ ప్రమాదం సంభవించింది. ‘బ్రిడ్జ్ ఆఫ్ అమెరికాస్‘ పక్కనే ఉన్న టాంకర్లకు ఆయిల్ నింపే కాంప్లెక్స్ దగ్గిర ఈ పేలుడు సంభవించింది. అకాశంలోకి ఎగిసిన ప్రళయాగ్ని ని , దట్టమయిన పొగ మేఘాన్ని అక్కడి సెక్యూరిటీలు కెమెరాలు రికార్డు చేశాయి.



ప్రేలుడు సంభవించగానే పనామా అధికారులు వంతెనను మూసేశారు. బ్రిడ్జి మీద ప్రేలుడు సంభవించలేదు. అయితే, బ్రిడ్జికిందికి మంటలు వ్యాపించడంతో దానిని భద్రత మీద అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జ్ ఆఫ్ అమెరికా అనే పనామాకి అత్యంత కీలకమయి రవాణ మార్గం. దీనిని 1962లో నిర్మించారు. దీనికి సమీపంలో ఉన్న బాల్బోవా అయిల్ టాంక్ కేంద్రం (Balboa oil tank facility) దగ్గిర ప్రేలుడు జరిగింది. ప్రజలు, వాహనాలు బ్రిడ్జి సమీపానికి రావద్దని అధికారులు ఆంక్షలు విధించారు.
పనామా కెనాల్ అనేది 82 కిమీ పొడవైన మానవ నిర్మితకాలువ. ఇది ఎట్లాంటిక్, పసిఫిక్ మహాసముద్రాలును కలిపే నౌకా రవాణ మార్గం. ప్రపంచ వాణిజ్యం లో దీని పాత్ర చాలా కీలకమయింది. ఈ కాలువ నిర్మాణం ఒక గొప్ప పోరాటం. అనేక మంది ప్రాణాలుకోల్పోవడం, నిర్మాణం వదిలేయడం చాలా సార్లుజరిగింది. చివరకు 1914లో నిర్మాణం పూర్తయింది. దీనితో అమెరికా పడమటి తీరం చేరుకునేమార్గం కొన్ని వేల కిలో మీటర్లు తగ్గింది. ఈ కాలువ లేనపుడు అమెరిక ఆవలి తీరం చేరుకోవాలంటే దక్షిణ అమెరికా కేప్ హార్న్ నుచట్టి అంటే రావాలసి వచ్చేది. కాలువ తవ్వాక దాదాపు 8000 నాటికల్ మైల్స్ (15000)కిమీ దూరం తగ్గింది.
ఇరాన్ మీద దాడులు చేసి అక్కడి వంతెనలను అమెరికా, ఇజ్రేల్ కు కూల్చేస్తున్నపుడు అమెరికా వాణిజ్యానికి ఆయువు పట్టయిన బ్రిడ్జ్ ఆప్ అమెరికాస్ దగ్గిర ఈ పేలుడు సంభవించింది. యుద్ధానికి ఈ పేలుడు కు సంబంధమేమయినా ఉందేమో ఇంకా తెలియడం లేదు.



Read More
Next Story