ఈ సారి ఎండలు దంచేస్తాయి..ఐఎండీ
x

ఈ సారి ఎండలు దంచేస్తాయి..ఐఎండీ

ఎండలు మండుతున్నాయి. ఏప్రిల్‌లో భానుడి తాపాన్ని చూస్తున్న జనం.. ఇక మే మాసంలో పరిస్థితి ఎలా ఉంటుందోనని బెంబేలెత్తుతున్నారు.


వేసవి కాలం కావడంతో ప్రజలకు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరిక జారీ చేసింది. ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ డైరెక్టర్‌ మోహపాత్ర తెలిపారు. పశ్చిమ హిమాలయ ప్రాంతం, ఈశాన్య రాష్ట్రాలు, ఉత్తర ఒడిశాలోని కొన్ని ప్రాంతాలలో సాధారణం లేదా సాధారణం కంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, దేశంలోని వివిధ ప్రాంతాల్లో 10 నుంచి 20 రోజులపాటు వేడిగాలులు వీస్తాయని చెప్పారు. గుజరాత్, మధ్య మహారాష్ట్ర, ఉత్తర కర్ణాటక, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఒడిశా, ఉత్తర ఛత్తీస్‌గఢ్, ఆంధ్రప్రదేశ్‌లో వేడిగాలుల ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు.
కాగా భారతదేశంలో ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 మధ్య ఏడు దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.
Read More
Next Story