శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్
x

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారి అరెస్ట్

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సీఐఎస్ఎఫ్ అధికారి వేషంలో మోసాలు చేసిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


శంషాబాద్ విమానాశ్రయంలో ఒక వ్యక్తిని భద్రతా సిబ్బంది అరెస్ట్ చేశారు. తనని తాను సీఐఎస్ఎఫ్ అధికారికా చెప్పుకుంటున్న అతడు నకిలీ అధికారిగా పోలీసులు గుర్తించారు. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అతని గురించి వివరాలు బయటకు తీస్తో విస్తుబోయే అంశాలు వెలుగు చూశాయి. తీగ లాగితో డొంక కదిలింది అన్న సామెత ఇతనికి పక్కాగా సూట్ అయ్యేలా ఉంది. ఎందుకంటే నకిలీ సీఐఎస్ఎఫ్ అధికారిగా మోసాలు చేస్తున్న ఆ వ్యక్తి తన ఈ గెటప్‌తో పదుల సంఖ్యలో యువతులను మోసం చేసినట్లు ఒప్పుకున్నాడు.

బాలకృష్ణ అనే వ్యక్తి సీఐఎస్ఎఫ్ అధికారిగా వేషధారణ చేసి ఎయిర్‌పోర్ట్ పరిసరాల్లో సంచరిస్తూ కనిపించాడు. అతని ప్రవర్తనపై అనుమానం వచ్చిన సిబ్బంది ప్రశ్నించగా, సరైన సమాధానాలు ఇవ్వలేకపోయాడు. దీంతో వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో నిందితుడు చెప్పిన విషయాలు పోలీసులను షాక్‌కు గురిచేశాయి. పెళ్లి కాని యువతులను లక్ష్యంగా చేసుకుని, వివాహం పేరుతో మోసం చేయడానికే తాను ఈ వేషం వేసుకున్నట్లు వెల్లడించాడు.

సీఐఎస్ఎఫ్ అధికారిగా నటిస్తూ ఇప్పటివరకు 67 మంది మహిళలను మోసం చేసినట్లు తెలిపాడు. మ్యాట్రిమొనీ వెబ్‌సైట్‌ల ద్వారా యువతులతో పరిచయం పెంచుకుని, పోలీస్ అధికారిగా నమ్మబలికి వల వేసినట్లు సమాచారం. తరువాత వారితో సన్నిహితంగా మాట్లాడి వివిధ రకాలుగా మోసాలకు పాల్పడినట్లు బయటపడింది. నిందితుడు శ్రీకాకుళం జిల్లా వాసి అని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, మరింత లోతుగా దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Read More
Next Story