పంజాబ్-హర్యానా సరిహద్దులో నేడు రైతుల క్యాండిల్ మార్చ్
x

పంజాబ్-హర్యానా సరిహద్దులో నేడు రైతుల క్యాండిల్ మార్చ్

కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతు రుణమాఫీపై చట్టబద్ధ హామీ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.


కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ), స్వామినాథన్‌ కమిషన్‌ సిఫార్సుల అమలు, రైతు రుణమాఫీపై చట్టబద్ధమైన హామీ ఇవ్వాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. డిమాండ్లను పరిష్కరించాలంటూ పంజాబ్, హర్యానా రైతులు ‘‘ఢిల్లీ చలో’’ కార్యక్రమానికి బయల్దేరిన విషయం తెలిసిందే. వారిని ఢిల్లీలోకి ప్రవేశించకుండా పోలీసు ప్రత్యేక బలగాలు పంజాబ్-హర్యానా సరిహద్దులో అడ్డుకోవడంతో రైతులంతా అక్కడే తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు.

ఈ నేపథ్యంలో రైతుల పక్షాన పోరాడుతున్న సంయుక్త కిసాన్ మోర్చా (నాన్-పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా (KMM) నాయకులు వచ్చే వారంలో నిర్వహించే కార్యక్రమాల జాబితాను వివరించారు. అంతకంటే ముందు ఈ రోజు (శనివారం) క్యాండిల్ మార్చ్ చేపట్టాలని యోచిస్తున్నారు. రేపు (ఆదివారం) వ్యవసాయ సంబంధిత సమస్యలపై సెమినార్లు నిర్వహించనున్నారు.
26న దిష్టిబొమ్మల దహనం..
ఫిబ్రవరి 29న తమ 'ఢిల్లీ చలో' మార్చ్‌కు సంబంధించి భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటామని శుక్రవారం (ఫిబ్రవరి 23) రైతు నాయకులు ప్రకటించారు. అప్పటి వరకు పంజాబ్-హర్యానా సరిహద్దులోని రెండు ప్రదేశాలలో వారు తమ నిరసనను కొనసాగిస్తున్నారు.
ఫిబ్రవరి 26న ప్రపంచ వాణిజ్య సంస్థ (WTO), కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేస్తారు.
ఖానౌరీలో బుధవారం జరిగిన ఘర్షణల్లో భటిండాకు చెందిన శుభకరన్ సింగ్ అనే 21 ఏళ్ల యువ రైతు ఈ ఘర్షణలో మరణించాడు. 12 మంది పోలీసులు గాయపడ్డారు. దీంతో రైతులు తమ పాదయాత్రను రెండు రోజుల పాటు వాయిదా వేశారు.
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సింగ్ శుభకరన్ సోదరికి రూ. కోటి పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ప్రకటించారు. యువ రైతు మరణానికి కారణమైన వారిపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని నిరసనకారులు పట్టుబడుతున్నారు. గతంలో ఖానౌరీ సరిహద్దులో భటిండాలోని అమర్‌ఘర్ గ్రామానికి చెందిన 62 ఏళ్ల దర్శన్ సింగ్ అనే మరో రైతు గుండెపోటుతో మరణించాడు.
Read More
Next Story