బాలి చేనేత సదస్సుకు వస్తున్న ఇండోనేషియా మేటి డిజైనర్
x

బాలి చేనేత సదస్సుకు వస్తున్న ఇండోనేషియా మేటి డిజైనర్

భారత్ లో ఏటా ఆగస్టున 7 జరిగే జాతీయ చేనేత దినోత్సవం లాగా అంతర్జాతీయ చేనేత దినోత్సవ సాధనకై ఇండోనేషియా బాలిలో అంతర్జాతీయ చేనేత సదస్సు జరుగుతున్నది


ఫిబ్రవరి, 18న బాలి లో జరిగే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ లోఇండో నేషియాకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్, నటి, మాజీ శాసన సభ సభ్యురాలు పాపీ ధర్సోనో హాజరవుతున్నారు. కాన్ఫరెన్స్ నిర్వాహకులు వెంకన్న నేత ఆమె ను కలసి బాలీ సదస్సుకు రావాలని ఆహ్వానించారు. ఆమె సానుకూలంగా స్పందించారు.

ఇక్కత్ చేనేత టెక్నిక్ పై పాపీ ధర్సోనో కు అపారమైన అనుభవం వుంది. ప్రపంచ వేదికలపై ఆమె పలు ఫ్యాషన్ షోలను ఇక్కత్ ధీమో తో నిర్వహించింది. ముఖ్యంగా ఇక్కత్ పరిశ్రమ అభివృద్ధికి ఆమె చేసిన సేవలు అద్వితీయం. ఆమె అనుభవం, సేవలు తెలంగాణ చేనేత పరిశ్రమ పురోగవృద్దికి ఉపయోగపడతాయని వెంకన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

పాపీ ధర్సోనో ఫ్రాన్స్‌లోని ఎకోల్ సుపీరియూర్ టెక్నిక్ డి లా మోడ్ (ESMOD)లో ఫ్యాషన్‌ విద్యని అభ్యసించింది.

పారిసియన్ ఫ్యాషన్ టెక్నిక్ లతో ఇండోనేషియా వారసత్వాన్ని మిళితం చేసి డిజైన్ లను సృష్టించడం ఆమె గొప్ప తనం. 2015లో ప్రారంభమైన ఇండోనేషియా ఫ్యాషన్ వీక్ కి ఆమె వ్యవస్థాపకురాలు. పాపీ ధర్సోనో 2009 నుండి 2014 వరకు సెంట్రల్ జావాకు శాసనసభ సభ్యురాలుాగా ఉన్నారు. ఇండోనేషియాలో ఆమెకు 10 విభిన్న కంపెనీలను నిర్వహిస్తున్న మేటి వ్యాపారవేత్తలలో ఒకరిగా గుర్తింపు ఉంది.

ఇప్పటికే వరల్డ్ వీవర్స్ కాన్ఫరెన్స్ కు హాజరయ్యేందుకు ఇండోనేషియా బాలి గవర్నర్ ఎస్.ఎం. మహేంద్ర జయ, బాలి టూరిజం బోర్డ్ హెడ్ రాయ్ సూర్య విజయ అంగీకరించారు.

ఇలాగే ఇండోనేషియా టూరిజం మంత్రి, ఇండోనేషియా రాయబారిని సదస్సుకు ఆహ్వానించారు. వారు కూడా హాజరయ్యే అవకాశం ఉందని వెంకన్న తెలిపారు.

Read More
Next Story