హనుమకొండలో తండ్రి, కుమార్తె సజీవ దహనం ఘటన
x

హనుమకొండలో తండ్రి, కుమార్తె సజీవ దహనం ఘటన

కాజీపేటలో అనుమానాస్పద మృతిపై పోలీసులు దర్యాప్తు, అల్లుడిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగుతోంది.


హనుమకొండలో సంచలనం రేపిన ఘటన వెలుగులోకి వచ్చింది. తండ్రి, కుమార్తె సజీవ దహనమై మృతిచెందిన ఘటన తాజా ఆందోళనకు కారణమైంది. బుధవారం వేకువజామున నాలుగు గంటల సమయంలో కాజీపేట మండలం కడిపికొండ రాజీవ్ గృహకల్పలో ఈ ఘటన చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులను రాజశేఖర్ (54), కుమార్తె రాజశ్రీ (24)గా గుర్తించారు. రాజశ్రీకు 2023లో ప్రవీణ్ అనే వ్యక్తితో వివాహం జరిగినట్లు తెలిసింది. వారికి ఇద్దరు చిన్నారులు ఉన్నట్లు సమాచారం.

కుటుంబ కలహాల నేపథ్యంలో ఈ ఘటన జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అల్లుడు ప్రవీణ్ వారిద్దరిపై డీజిల్ పోసి నిప్పు పెట్టి ఉండవచ్చని ప్రాథమిక సమాచారం సూచిస్తోంది. ఘటనా స్థలంలో పోలీసులు వేలిముద్రలు సహా కీలక ఆధారాలను సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రవీణ్‌ను అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు దర్యాప్తు అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

Read More
Next Story