
తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం ఫిబ్రవరి విశేషాలు
తిరుమల వేంకటేశ్వరుని దర్శించుకున్న తర్వాత తిరుచానూరు సందర్శించడం ఆనవాయితీ
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీల్లో శుక్రవారం సందర్భంగా శ్రీ పద్మావతి అమ్మవారి తిరుచ్చి ఉత్సవం.
- ఫిబ్రవరి 15న ఉత్తరాషాడ నక్షత్రం సందర్భంగా సాయంత్రం 6:45 గంటలకు గజవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహిస్తారు.
శ్రీ సుందరాజ స్వామి వారి ఆలయం:
- ఫిబ్రవరి 20న ఉత్తరాభాద్ర నక్షత్రం - శ్రీ సుందర రాజ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ బలరామకృష్ణుల ఆలయం:
- ఫిబ్రవరి 25న రోహిణి నక్షత్రం సందర్భంగా ఉత్సవర్లకు తిరుచ్చి ఉత్సవం.
శ్రీ సూర్యనారాయణ స్వామి వారి ఆలయం :
- ఫిబ్రవరి 06న హస్తా నక్షత్రం - శ్రీ సూర్య నారాయణ స్వామివారి తిరుచ్చి ఉత్సవం.
శ్రీ శ్రీనివాస స్వామివారి ఆలయం :
- ఫిబ్రవరి 07, 14, 21, 28 తేదీల్లో శ్రీ శ్రీనివాస స్వామివారి మూలవర్లకు ఉదయం 8 గంటలకు అభిషేకం.
అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో విశేష ఉత్సవాలు
- ఫిబ్రవరి 06, 13, 20, 27 తేదీలలో శుక్రవారం సందర్భంగా ఉదయం 7 గంటలకు వస్త్రాలంకరణ సేవ, అభిషేకం.
ఫిబ్రవరి 03న మంగళ వారం ఉదయం 8 గంటలకు అష్టదళ పాదపద్మారాధన సేవ.
- ఫిబ్రవరి 11న ఉదయం 8 గంటలకు అష్టోత్తర శత కలశాభిషేకం.
- ఫిబ్రవరి 16న ఉదయం 10.30. గంటలకు కల్యాణోత్సవం.
- ఫిబ్రవరి 01, 08, 15, 22వ తేదీలలో శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారికి ఉదయం 8.15 గంటలకు అభిషేకం.

