ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో ఫెడరల్ సర్వే హైలెట్స్..
x

ఢిల్లీ, హర్యానా, పంజాబ్‌లో ఫెడరల్ సర్వే హైలెట్స్..

ఫెడరల్-పుతియతలైమురై-యాప్ట్ 2024 ప్రీ-పోల్ సర్వే: ఢిల్లీ, హర్యానాలో కమలం పార్టీ వికసించే అవకాశం ఉంది. అయితే పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు పట్టం కట్టేలా ఉన్నారు.


ఢిల్లీ, హర్యానాలో కమలం పార్టీ వికసించే అవకాశం ఉంది. అయితే పంజాబ్ లో మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీకే ప్రజలు పట్టం కట్టేలా ఉన్నారు. రాష్ట్రాల వారీగా చూస్తే..

ఢిల్లీ..








ఢిల్లీలో క్లీన్ స్వీప్ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. అక్కడ 66.73% మంది ఓటర్లు కమలం పార్టీకే ఓటు వేస్తామని చెబుతున్నారు. కాంగ్రెస్‌కు 13.22 శాతం మంది, AAPకి 11.32 శాతం మంది ఓటు వేస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్ష నాయకులలో ప్రధానమంత్రి అభ్యర్థిగా రాహుల్ గాంధీకి 18.63శాతం మంది, అరవింద్ కేజ్రీవాల్ 19.99% మంది మొగ్గు చూపారు. ఆల్ టైమ్ ఫేవరెట్ ప్రధానుల జాబితాలో ( 69.03శాతం మంది ) ప్రధాని నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. ఢిల్లీలో బీజేపీకి ప్రజల మద్దతు దాదాపు 10 శాతం పెరిగింది. కాంగ్రెస్ ఓట్ల శాతంలో 9.41 శాతం పాయింట్ల తగ్గుదల కనిపించింది. AAP కూడా ఢిల్లీలో దాని ఓట్ షేర్‌లో 6.88 శాతం పాయింట్లు పడిపోయింది. ఓట్ల శాతం ఆధారంగా, ఢిల్లీ సీట్ల అంచనాలు:

హర్యానా ..

హర్యానాలో 52.97% మంది బిజెపికి మొగ్గు చూపారు. కాంగ్రెస్‌కు 21.27 శాతం మంది, జననాయక్ జనతా పార్టీకి 1.29శాతం, INLD కి 1.98 శాతం మంది మద్దతు పలికారు. చెప్పలేను/తెలియదు అన్న వారు 18.04 శాతం మంది ఉన్నారు.







2019 లోక్‌సభ ఎన్నికలను పోల్చి చూస్తే.. BJP ఓట్ షేర్‌లో 5.24% శాతం పాయింట్ల తగ్గుదల కనిపిస్తుంది. కాంగ్రెస్ కూడా దాని ఓట్ షేర్‌లో 7.24 శాతం పాయింట్లు పడిపోయింది. ఓట్ల శాతం ఆధారంగా, హర్యానా సీట్ల అంచనాలు:

పంజాబ్

ఒపీనియన్ పోల్ ప్రకారం ఓట్ షేర్ ప్రకారం 26.86 శాతం మంది పంజాబ్ ఓటర్లు తాము AAPకి ఓటు వేస్తామని చెప్పారు. 27.89 శాతం మంది బీజేపీకి, 17.47 శాతం మంది కాంగ్రెస్‌కు, 4.53% మంది అకాలీదళ్‌కు ఓటు వేస్తామని చెప్పారు.






2019 లోక్‌సభ ఎన్నికల్లో BJP , SAD కలిసి పోరాడాయి. వారి ఉమ్మడి ఓట్ల శాతం 37.50% (9.74 + 27.76). రైతుల ఆందోళన తర్వాత అకాలీదళ్ బీజేపీతో విడిపోయింది. ఒపీనియన్ పోల్ ఫలితాల ప్రకారం పంజాబ్‌లో BJP పుంజుకుంది. కెప్టెన్ వంటి ప్రముఖ నాయకులు నిష్క్రమించిన తర్వాత కాంగ్రెస్ స్థాయి పడిపోయింది. అమరీందర్ సింగ్, సునీల్ జాఖర్ ఇద్దరూ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ 23.11 శాతం పాయింట్ల క్షీణతను సూచిస్తుంది. గత మూడేళ్ళలో AAP పంజాబ్‌లో గణనీయంగా అభివృద్ధి చెందింది. 2022లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో అద్భుతమైన విజయాన్ని సాధించింది.

Read More
Next Story