ఐదో టెస్ట్: భూమ్రా ఇన్, రాహూల్ ఔట్.. భారత స్క్వాడ్ సిద్ధం
x
భారత ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ భూమ్రా

ఐదో టెస్ట్: భూమ్రా ఇన్, రాహూల్ ఔట్.. భారత స్క్వాడ్ సిద్ధం

ఐదో టెస్ట్ కు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ భూమ్రా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ ప్రకటించింది. రాహూల్ మాత్రం గాయం తో జట్టుకు దూరమయ్యాడు .. కానీ వాషింగ్టన్ సుందర్ ను మాత్రం..


ఇంగ్లండ్ తో భారత్ ధర్మశాల వేదికగా తలపడనున్న చివరి టెస్ట్ కు జట్టు కూర్పు ఖరారు అయింది. నాలుగో టెస్ట్ లో పనిభారం కారణంగా విశ్రాంతి కల్పించిన భూమ్రా తిరిగి జట్టుతో చేరనున్నాడు. గాయం కారణంగా లండన్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్న దృష్ట్యా కేఎల్ రాహూల్ ఐదో టెస్ట్ కు అందుబాటులో ఉండట్లేదని బీసీసీఐ ప్రకటించింది. రాహూల్ ను వైద్య బృందం నిశితంగా పరిశీలిస్తోందని, అయితే తనకు సర్జరీ చేసిన డాక్టర్లు తిరిగి లండన్ రావాలని సూచించడంతో అతడు బయల్దేరి వెళ్లిపోయినట్లు సమాచారం.

"కేఎల్ రాహూల్ ఫిట్ నెస్ సాధించనందున ధర్మశాలలో జరిగే టెస్ట్ కు అందుబాటులో ఉండట్లేదు. బీసీసీఐ సీనియర్ వైద్య బృందం, లండన్ లోని వైద్యుల బృందంతో సమన్వయం చేసుకుని అతడి ఆరోగ్య పరిస్థితి ని అంచనా వేస్తోంది " అని భారత క్రికెట్ నియంత్రణ మండలి విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించింది.
భూమ్రా బ్యాక్, సుందర్ ను విడుదల చేసిన జట్టు
ధర్మశాలలో జరిగే ఐదో టెస్ట్ కి సీనియర్ ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ భూమ్రా అందుబాటులో ఉంటాడని బీసీసీఐ వెల్లడించింది. అలాగే జట్టుతో ఉన్న వాషింగ్టన్ సుందర్ ను జట్టు నుంచి విడుదల చేసింది. తమిళనాడు రంజీ సీజన్ లో సెమీస్ కు చేరిన నేపథ్యంలో సుందర్ ను విడుదల చేయాలని నిర్ణయించుకుంది. మార్చి 2 నుంచి ముంబైతో జరగనున్న సెమీస్ సుందర్ జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. అలాగే రజత్ పాటిదార్ ను సైతం మొదట మధ్య ప్రదేశ్ సెమీస్ దృష్ట్యా విడుదల చేయాలని బీసీసీఐ అనుకున్నా.. రాహూల్ గాయంపై లండన్ వైద్యులతో సంప్రదింపులు జరుపుతున్న నేపథ్యంలో పాటిదార్ జట్టుతోనే ఉంచాలని నిర్ణయించినట్లు సమాచారం.
భారత్ ఇప్పటికే టెస్ట్ సిరీస్ ను 3-1తో కైవసం చేసుకుంది. అయినప్పటికీ కూడా ఐదో టెస్ట్ ను ఏమాత్రం తేలిగ్గా తీసుకోబోమని కెప్టెన్ రోహిత్ శర్మ ప్రకటించారు. ధర్మశాల పరిస్థితులు ఫాస్ట్ బౌలర్లకు అనువుగా ఉండనున్న నేపథ్యంలో భారత్ భూమ్రా, సిరాజ్ తో పాటు రాంచీ సంచలనం ఆకాశ్ ను కూడా ఆడించాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే జరిగితే మరోసారి కుల్డీప్ బెంచ్ కు పరిమితం కావచ్చు.
ఐదో టెస్ట్ కు భారత్ స్క్వాడ్
రోహిత్ శర్మ( కెప్టెన్) , జస్ప్రీత్ భూమ్రా( వైస్ కెప్టెన్), యశస్వి జైశ్వాల్, శుభ్ మన్ గిల్, రజత్ పాటిదార్, సర్పరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్( వికెట్ కీపర్) కె ఎస్ భరత్( వికెట్ కీపర్), దేవ్ దత్ పడిక్కల్, ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేష్ కుమార్, ఆకాశ్ దీప్


Read More
Next Story